వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీయేలోకి టీడీపీ? ముహూర్తం ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌జాస్వామ్య కూట‌మి (ఎన్డీయే)లోకి మ‌రోసారి తిరిగి ప్ర‌వేశించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర‌మోడీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్రబాబుకు ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం మిగిలింది. ఆ పార్టీకున్న రాజ్య‌స‌భ స‌భ్యుల్లో న‌లుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం కావ‌డంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే స‌హ‌కారాన్ని బాబు కోరుకుంటున్నారు. మూడు సంవ‌త్స‌రాలుగా ఆయ‌న అదే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

Recommended Video

Chandrababu Kuppam Tour ఉచిత హామీల సునామీ *Politics | Telugu OneIndia
 ఫలించిన ప్రయత్నాలు

ఫలించిన ప్రయత్నాలు


చేయ‌గా.. చేయ‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫలించిన‌ట్లు తెలుస్తోంది. భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి తెలుగుదేశం పార్టీకి కూడా ఆహ్వానం అందింది. త‌ర్వాత ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ స‌మావేశానికి ఢిల్లీ పెద్ద‌ల నుంచి బాబుకు ఆహ్వానం అంద‌గా ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆ స‌మ‌యంలోనే బాబు కుమారుడు లోకేష్ అమిత్ షాతో ఎన్డీయేలో చేరేందుకు చ‌ర్చ‌లు జ‌రిపార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

 పెరుగుతున్న దాడుల తీవ్రత

పెరుగుతున్న దాడుల తీవ్రత

రాష్ట్రంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో అధికార పార్టీ నుంచి దాడులు ఎక్కువ‌వ‌డంతోపాటు పార్టీ కేంద్ర కార్యాల‌యంపైకి వాహ‌నాల్లో దూసుకురావ‌డం, ఉండ‌వ‌ల్లిలోని బాబు ఇంటిద‌గ్గ‌ర ఎమ్మెల్యేలే స్వయంగా ర‌గ‌డ సృష్టించ‌డంతోపాటు దాడుల తీవ్రత పెరుగుతోందని ఆయనకు భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్‌జీ అంచనా వేసింది. ఈ నేప‌థ్యంలో బాబుకు భ‌ద్ర‌త‌ను పెంచారు. జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీలో ఉన్న ఆయ‌న‌కు షిఫ్టుకు 8 మంది క‌మాండోలు ఉండేవారు. ఇప్ప‌డు వారి సంఖ్య‌ను మ‌రో 20కి పెంచారు. షిఫ్టుకు 12 మంది ఉంటున్నారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో బాబు కాన్వాయ్‌పై రాళ్లు వేయ‌డం కూడా ఎన్ఎస్‌జీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఆయ‌న ఇంటిని, కార్యాల‌యాన్ని స‌మ‌గ్రంగా ప‌రిశీలించి వెంట‌నే క‌మాండోల‌ సంఖ్యను పెంచారు. చంద్రబాబుకు భ‌ద్ర‌తకు సంబంధించి కేంద్ర ఇంటిలిజెన్స్ నుంచి అందిన సమాచారం కూడా ఇందుకు ఉపయోగపడింది. దీన్ని కూడా టీడీపీ శ్రేణులు సానుకూల ప‌రిణామంగా భావిస్తున్నారు.

 దూరమైన భాగస్వామ్య పక్షాలు

దూరమైన భాగస్వామ్య పక్షాలు

మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో కీల‌క‌మైన భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎన్డీయేకు దూర‌మ‌య్యాయి. శివ‌సేన‌, అకాలీద‌ళ్‌తోపాటు ఆర్‌జేడీ కూడా దూరం జ‌రిగింది. చెప్పుకోద‌గిన బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షం ఇప్పుడు బీజేపీకి లేదు. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు విష‌య‌మై ఢిల్లీ నాయ‌క‌త్వం ఏపీలో స‌ర్వే నిర్వ‌హింప‌చేయించింది. పొత్తువల్ల టీడీపీకి లాభం లేక‌పోయినా లోక్‌స‌భ సీట్లలో భారీగా ఓటింగ్ పెరుగుతుంద‌ని ఈ స‌ర్వేలో తేలింది. విజయదశమికి ఎన్డీయేలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేర‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం వైసీపీకి కూడా తెలుసని, ఎన్డీయేలో చేర్చుకోవ‌ద్ద‌ని ఆ పార్టీ నేత‌లు లాబీయింగ్ చేసినట్లు స‌మాచారం. అయితే ఇటీవ‌ల వైసీపీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్ టీడీపీ ఎన్డీయేలో చేరబోతుందనేదానికి బ‌లం చేకూరుస్తోంది. టీడీపీతో బీజేపీ క‌లుస్తుంద‌ని తామ‌నుకోవ‌డంలేద‌ని, ద‌రిద్రాన్ని ఎవ‌రైనా తెచ్చి పెట్టుకుంటారా? అంటూ ట్వీట్ చేశారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తీసుకోబతున్నాయని స్పష్టమవుతోంది.

English summary
The stage is being set for Telugu Desam Party's re-entry into the National Democratic Alliance (NDA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X