ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా గెలుపు టీడిపిదే..నారా లోకేష్ చిట్ చాట్..

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న మ‌హానాడు లో చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ కాసేపు హ‌ల్ చ‌ల్ చేసారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఉన్న ర‌క్తదాన శిభిరాన్ని సంద‌ర్శించిన ఆయ‌న కాసేపు మీడియా ప్ర‌ద‌తినిదుల‌తో గ‌డిపారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని లోకేష్ తెలిపారు.

Recommended Video

    Tdp Mahanadu 2018 : Nara Lokesh speech
     రెట్టంపు ఉత్సాహంతో మ‌హానాడుకు వ‌చ్చిన పార్టీ శ్రేణులు..

    రెట్టంపు ఉత్సాహంతో మ‌హానాడుకు వ‌చ్చిన పార్టీ శ్రేణులు..

    మ‌హానాడు చివ‌రిరోజున కార్య‌క‌ర్త‌ల‌తో పాటు నాయ‌కుల్లో ఉత్ప‌హం ఉర‌క‌లేసింది. ముఖ్యంగా నాయ‌కులు మ‌హానాడు విజ‌య‌వంతం ఐనందుకు, ఊహించ‌ని దానికంటే పెద్ద‌సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు మ‌హానాడుకు త‌ర‌లి రావ‌డం నాయ‌కుల్లో మంచి ఊపునిచ్చింది. పంచాయితీ రాజ్ శాఖా మంత్రి లోకేష్ మ‌హానాడు భోజ‌న విరామ‌స‌మ‌యంలో ర‌క్త‌దానం చేసి పార్ట శ్రేణుల్లో జోష్ నింపారు. రక్త దాన శిభిరానికి వ‌చ్చిన లోకేష్ మీడియా గ్యాల‌రీ వైపు వ‌చ్చి పాత్రికేయుల‌తో కాసేపు చిట్ చాట్ చేసారు. కేంద్ర రాష్ట్ర రాజ‌కీయాల గురించి, అమ‌రావ‌తి అభివ్రుద్ది గురించి ప్ర‌స్తావించారు. అంతే కాకుండా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కోవ‌డానికి తెలుగుదేవం పార్టీ సిద్దంగా తెలిపారు.

     ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం...

    ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం...

    ఆస్తులు ప్ర‌క‌టించ‌డానికి సాహ‌సం చేయ‌ని వాళ్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ని విమ‌ర్శిస్తున్నార‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. తెలుగుదేశం పార్టీ మొద‌టి నుండీ చెప్తున్న‌ట్టు బీజేపి వైసీపి కుమ్మక్కు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతో్ద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల ముందు మోడీ ఇచ్చిన హామీల‌కు ఆక‌ర్శించి బీజేపి తో జ‌త క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. న‌మ్మంచి మోసం చేయ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీకి వెన్న‌తో పెట్టిన విద్య అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా అమ‌రావ‌తి అభివ‌వ్రుద్దిని నిలువ‌రిచ‌లేర‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

     వైసీపి, బీజెపి కుమ్మ‌క్కు రాజ‌కీయాల‌కు భ‌య‌ప‌డేది లేదు....

    వైసీపి, బీజెపి కుమ్మ‌క్కు రాజ‌కీయాల‌కు భ‌య‌ప‌డేది లేదు....

    తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని ఏమి చేయ‌లేక పోల‌వ‌రం ప్రాజెక్టుపైన లేనిపోని అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిపారు. అమ‌ర‌వాతి సత్వ‌ర అభివృద్ధి కోసం టిడిపి క‌ట్టుబ‌డి ఉంద‌న్న విష‌యాన్ని బిజెపి గ్ర‌హించాల‌న్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వంప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను కార్య‌క‌ర్త‌లు గ్ర‌హించారు కాబ‌ట్టే మ‌హానాడుకు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యార‌ని కేంద్ర కుట్ర‌ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా ఎదుర్కోవాల‌ని నాయ‌కుల‌ను కోర‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. టిడిపి ప్ర‌తి కార్య‌క‌ర్త కూడా ప్ర‌భుత్వ శ్రేయ‌స్సును కాంక్షిస్తున్నార‌ని అన్నారు.

    దేశ‌రాజ‌కీయాల్లో స‌మూల మార్పుకు 2019 ఎన్నిక‌లు నాంది ప‌లుకుతాయి..

    దేశ‌రాజ‌కీయాల్లో స‌మూల మార్పుకు 2019 ఎన్నిక‌లు నాంది ప‌లుకుతాయి..

    రాబోయే ఎన్నిక‌ల్లో బిజెపి దానికి స‌హ‌క‌రిస్తున్న వైఎస్ఆర్ సిపిల‌ను ప్ర‌జ‌లు ఘోరంగా ఓట‌మి పాలు చేస్తార‌ని లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్రదేశ్ లో నాలుగు సంవ‌త్స‌రాల్లో 16 వేల కిలోమీట‌ర్ల రోడ్లు వేస్తే, 10 ఏళ్ల కాంగ్రెస్ హాయంలో కేవ‌లం 11 వేల కిలోమీట‌ర్ల రోడ్లు వేయ‌గ‌ల‌గార‌ని తెలిపారు. అభివృద్ధిలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి ఉన్న వ్య‌త్యాసం ఇదే అని అన్నారు. అభివృద్ధిలో దూసుకెళుతున్న తెలుగుదేశం పార్టీని ఎవ‌రూ ఏమి చేయ‌లేర‌ని నారాలోకేష్ తెలిపారు. రాబోయే ఎన్నిక‌లు దేశ రాజ‌కీయాల‌ను స‌మూలంగా మార్చి వేస్తాయ‌ని అందులో తెలుగుదేశం పార్టీ పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+