సీమాంధ్రలో 9 జెడ్పీలు టిడిపి వశం, 4 జగన్ పార్టీకి
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ జెడ్పీలను కైవసం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాలుగు, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఒక్క జెడ్పీని గెలుచుకుంది.
ఇప్పటి వరకు సీమాంధ్రలో టిడిపి 5017 ఎంపీటీసీలను, 362 జెడ్పీటీసీలను, వైయస్సార్ కాంగ్రెసు 3977 ఎంపీటీసీలను, 254 జెడ్పీటీసీలను గెలుచుకుంది. తెలంగాణలో కాంగ్రెసు 2311 ఎంపీటీసీలు, 177 జెడ్పీటీసీలను, తెరాస 1884 ఎంపీటీసీలను, 191 జెడ్పీటీసీలను, టిడిపి 1040 ఎంపీటీసీలను, 52 జెడ్పీటీసీలను గెలుచుకుంది.
సీమాంద్రలో... తూర్పు గోదావరి (57) , పశ్చిమ గోదావరి (46), కృష్ణా (49), గుంటూరు (57), అనంతపురం (63), చిత్తూరు (65), శ్రీకాకుళం (38), విజయనగరం (34), విశాఖపట్నం (39) జెడ్పీలను టిడిపి గెలుచుకోగా, ప్రకాశం (56), కడప (50), కర్నూలు (53), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (46) జెడ్పీలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది.

తూర్పు గోదావరిలో టిడిపి 43, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14, పశ్చిమ గోదావరిలో టిడిపి 43, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 3, కృష్ణాలో టిడిపి 35, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14, గుంటూరులో టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 23, అనంతపురంలో టిడిపి 42, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 20, చిత్తూరులో టిడిపి 36, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 28, శ్రీకాకుళంలో టిడిపి 22, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 16, విజయనగరంలో టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 24, విశాఖలో టిడిపి 24, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 జెడ్పీటీసీలను గెలుచుకున్నారు.
ప్రకాశంలో టిడిపి 25, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 31, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో టిడిపి 15, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 31, కడపలో టిడిపి 11, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 39, కర్నూలులో టిడిపి 20, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 30 జెడ్పీటీసీలను గెలుచుకుంది.












Click it and Unblock the Notifications