వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: అదే జరిగితే జగన్‌దే పైచేయి, కానీ, వైసీపీకి టిడిపి చెక్ ఇలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు టిడిపి, వైసీపీలు సన్నద్దమౌతున్నాయి.ఎన్నికల నాటికి నంద్యాల, కాకినాడ ఫలితాల ప్రభావం ప్రజలపై ఉండేలా అధికార టిడిపి ప్లాన్ చేస్తోంది. అయితే పాదయాత్ర తమకు కలిసివచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.ముందస్తుగా ఎన్నికలు జరిగితే తమకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో ముందస్థు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఇటీవల కాలంలో సాగుతోంది. అయితే కేంద్రం కూడ ముందస్తు ఎన్నికలకు సానుకూలంగా ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

బిజెపి షాక్: బాబుతో ప్రమాదం, 2019లో ఏం చేద్దాం?బిజెపి షాక్: బాబుతో ప్రమాదం, 2019లో ఏం చేద్దాం?

2018 చివర్లోనే ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు. వైసీపీ నేతలు కూడ ముందస్తు ఎన్నికల కోసం సన్నాహలు చేసుకొంటున్నారు.

ఏపీలో ముందస్థు ఎన్నికలు ఎవరికీ లాభం

ఏపీలో ముందస్థు ఎన్నికలు ఎవరికీ లాభం

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరి లాభమనే విషయమై తీవ్ర చర్చ సాగుతోంది. 2017 నవంబర్ 2వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే పాదయాత్ర ప్రభావం ఎన్నికలపై కన్పిస్తోందని వైసీపీ నేతలు అబిప్రాయంతో ఉన్నారు. అదే జరిగితే రాజకీయంగా తమకు ముందస్తు ఎన్నికలు ప్రయోజనం కల్గించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలను ముందస్తు ఎన్నికల నాటికి లైవ్‌‌లో ఉంచగలిగితే రాజకీయంగా వైసీపీపై పైచేయి సాధించినట్టు అవుతోందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు ఎందుకంటే

ముందస్తు ఎన్నికలు ఎందుకంటే

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ప్రధమార్థంలో జరగాల్సి ఉంది. కానీ కేంద్రం జమిలి ఎన్నికల కోసం భారీ కసరత్తు చేస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. కాల పరిమితి పూర్తైన రాష్ట్రాల అసెంబ్లీలు ఏడాది అటూఇటుగా ఉన్న అసెంబ్లీలకు కలిపి లోక్‌సభ ఎన్నికలు జరపాలని లెక్కలు వేస్తున్నారు.వచ్చే అక్టోబర్‌లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే లోక్‌సభతో పాటు దాదాపుగా సగం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించవచ్చు. 2024కు పూర్తి స్థాయిలో జమిలి ఎన్నికల విధానాన్ని అమలులోకి తేవొచ్చనేది కేంద్రం ఆలోచన. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తమ నేతలకు తరచూ పిలుపునిచ్చారు.

ముందస్తుకు టిడిపి ప్లాన్ ఇదే

ముందస్తుకు టిడిపి ప్లాన్ ఇదే

నిజానికి ముందస్తు ఎన్నికలు వస్తే రాజకీయంగా తమకు ప్రయోజనం కలిగేలా బాబు ప్లాన్ చేస్తున్నారు.ఈ ఎన్నికల నాటికి నంద్యాల, కాకినాడ ఫలితాల ప్రభావాన్ని లైవ్‌లో ఉంచేందుకు అధికార పార్టీ అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది. దీనికి తోడు అక్టోబర్ నాటికి నాలుగున్నరేళ్ల అభివృద్ధి ఫలాలను ప్రజల ముందు ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో కోర్ క్యాపిటల్ నిర్మాణాలను ఆలోపు పూర్తి చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. డిజైన్లు ఖరారవడం ఆలస్యం.. నిర్మాణాలు ప్రారంభమవుతాయి. మౌలిక సదుపాయాల పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి టిడిపి తీవ్రంగా నష్టపోయింది.

పాదయాత్ర కలిసివచ్చేనా?

పాదయాత్ర కలిసివచ్చేనా?

ముందస్తు ఎన్నికలు జరిగితే రాజకీయంగా తమకు ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయని వైసీపీ భావిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 2వ, తేది నుండి జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర ప్రభావం ముందస్తు ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయడం, నవరత్నాలపై కూడ ప్రజల్లో అవగాహన కల్పించాలని వైసీపీ భావిస్తోంది.

English summary
Tdp and Ysrcp preparing for elections in Ap state. There is a spreading a rumour on union governament going to prephone election. So, Ap Cm Chandrabaunaidu also ready for prephone election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X