Gudivada Politics:గుడివాడలో టీడీపీ కొత్త లెక్కలు - సర్వేల్లో తేలిందేంటి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. టీడీపీ,జనసేన(TDP - Janasena) పొత్తు ఖాయం కావటంతో అభ్యర్దులు అలర్ట్ అవుతున్నారు. టీడీపీ ఈ ఎన్నికలను నవ్ ఆర్ నెవర్ గా భావిస్తోంది. దసరా రోజున పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే గుడివాడ(Gudivada) నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని టీడీపీ లక్ష్యంగా ఫిక్స్ చేసుకుంది. అక్కడ అభ్యర్ది ఎంపిక దాదాపు ఖరారైనా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజా సర్వే ద్వారా నియోజకవర్గంలో పరిస్థితిపైన టీడీపీ సమాచారం సేకరించింది.
గుడివాడపై ఫోకస్
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని(Kodali Nani) టీడీపీ హిట్ లిస్టులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గెలిచేందుకు టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. అక్కడ స్థానిక పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఎన్నారై వెనిగండ్ల రాము(Venigandla Ramu)..రావి వేంకటేశ్వరరావు(Ravi Venkateswara Rao) మధ్య సీటు కోసం పోటీ నెలకొని ఉంది.

అయితే, రాము స్థానికంగా పట్టు పెంచుకొనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పాటుగా పార్టీ యాక్టివిటీలో క్రియాశీలంగా మారారు. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ సమయంలోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రత్యేక సందర్భాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
రాము వైపు మొగ్గు
తాజాగా, నియోజకవర్గ పరిధిలో వర్షాల కారణంగా దెబ్బ తిన్న రైతాంగానికి తన సొంత ఖర్చుతో అండగా నిలిచారు. పార్టీ నేతలకు దగ్గరయ్యారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్థానిక యువతకు సహకారం అందించారు. గుడివాడ(Gudivada) టీడీపీ టికెట్ రాముకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందనే సమాచారంతో పార్టీ నేతలు ఆయనతో కొనసాగుతున్నారు.

ఇదే సమయంలో రావి వేంకటేశ్వర రావుకు ఎమ్మెల్సీ(MLC) ఇచ్చేలా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా నియోజకవర్గం లో తాజా పరిస్థితుల పైన పార్టీ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. ఆ సమయంలో రాము(Ramu) సేవా కార్యక్రమాలకు సాధారణ ప్రజలు దగ్గరవుతున్నట్లు గుర్తించారని సమాచారం. మరో వైపు రావి వేంకటేశ్వర రావు తీరు పైన కొంత మంది సొంత పార్టీ నేతలే అసహనంతో ఉన్నట్లు గుర్తించారు.
సర్వేలతో అలర్ట్
రావి పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో నియోజకవర్గంలో నేతలు ఉన్నట్లు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి గుడివాడ(Gudivada), గన్నవరం(Gannavaram) టీడీపీ ప్రత్యేక టాస్క్ గా తీసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది.

చంద్రబాబు(Chandra Babu) బయటకు వచ్చిన తరువాత మేనిఫెస్టోతో పాటుగా పొత్తులో భాగంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే సీట్ల పైన స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గుడివాడ లాంటి కీలక నియోజకవర్గాల్లోనూ అధికారికంగా అభ్యర్దుల ప్రకటన ఉండనుంది. వెనిగళ్ల రాము వైపే పార్టీ మొగ్గు చూపుతుందని.. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో రాము వర్సస్ నాని పోటీ ఖాయమని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications