కాళ్లు పట్టుకున్నా: అంధ విద్యార్థిపై ఘోరం (వీడియో)

కాకినాడ/మెదక్/విశాఖ: కాకినాడలో ఓ ఉపాధ్యాయుడు కర్కశంగా ప్రవర్తించాడు. కాళ్లమీద పడ్డా కూడా విద్యార్థులను గొడ్డును బాదినట్లు బాదాడు. అంధ పాఠశాలలో అంధ విద్యార్థిని చితకబాదిన అతను కూడా అంధుడేకావడం గమనార్హం. కాకినాడ గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/KW1RwMOYl4k?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

అల్లరి చేశారనే కారణంతో పాఠశాల కరెస్పాండెంట్ ఆఫీస్ రూంలో విద్యార్థులను కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నా వినిపించుకోకుండా కరెస్పాండెంట్ ముగ్గురు చిన్నారులపై దారుణంగా ప్రకవర్తించాడు. ఈ ఘటనపై వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీకి సమాచారం అందించారు. కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సుబ్బారావులను అరెస్టు చేశారు. అంతకుముందు కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌లను తల్లిదండ్రులు చితకబాదారు. విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Teacher beats three children in Kakinada

కర్నూలు జిల్లాలో దారుణం

డోన్ తారకరామ్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి రోజూ గొడవపడుతున్న ఓ వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కాశిం అనే వ్యక్తి మద్యం సేవించి కుటుంబసభ్యులతో గొడవపడుతుండటంతో విసుగు చెందిన భార్య తన కుమారుడితో కలిసి అతనిపై కొడవలితో దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కాశిం పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీ, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

కుక్కల స్వైర విహారం

విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెంలో కుక్కలు స్వైర విహారం చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. పదేళ్ల వికలాంగ బాలికపై కుక్కలు దాడి చేయడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. మొత్తం నాలుగు కుక్కలు బాలికపై మూకుమ్మడిగా దాడి చేశాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఆ బాలికను చేర్పించగా... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+