వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైన్ షాపుల వద్ద టీచర్లు.. ఇదేం నిర్ణయం..? ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

|
Google Oneindia TeluguNews

కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం(ఏప్రిల్ 5) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు తెరిచేందుకు అనుమతించింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ఒకసారి ఐదుగురిని మాత్రమే వైన్ షాపు వద్దకు అనుమతించాలి. అది కూడా ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. కానీ దాదాపు 46 రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులకు.. మద్యం షాపులు తెరుచుకుంటున్నాయడంతో ఉత్సాహం కట్టలు తెంచుకుంది.

Recommended Video

Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral

ఏ జాతరకో పోటెత్తినట్టు వైన్ షాపుల వద్దకు పోటెత్తారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పెద్ద సవాల్‌గా మారింది. కి.మీ మేర మందు బాబులు క్యూ కడుతుండటంతో.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులతో పాటు ప్రభుత్వం టీచర్లను కూడా రంగంలోకి దింపింది. వైన్ షాపుల వద్ద మందు బాబులను కంట్రోల్ చేసేందుకు టీచర్లకు కూడా అక్కడ డ్యూటీ వేసింది. విశాఖ జిల్లాలో వెలుగుచూసిన ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

వైన్ షాపుల వద్దకు మందు బాబులు వందల సంఖ్యలో చేరుకుంటుండటంతో.. అమ్మకాలు సక్రమంగా జరిగేందుకు, ఫిజికల్ డిస్టెన్స్‌ పాటించేలా చూసేందుకు టీచర్లను విధుల్లోకి దించారు. మౌఖిక ఆదేశాలతోనే ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్కూల్లో చదువు బోధించే టీచర్లను ఇలా మందుబాబులను కంట్రోల్ చేసేందుకు ఉపయోగించడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా టీచర్లు కూడా లాక్ డౌన్ విధుల్లో మొదటి నుంచి పాలుపంచుకుంటున్నారు. క్వారెంటైన్ కేంద్రాల్లో,కూరగాయల మార్కెట్లలో,ఫుడ్ సప్లైలో ఇలా పలుచోట్ల పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు.

teachers in duty to control boozers at wine shops in andhra pradesh

కానీ వైన్ షాపుల వద్ద వారిని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సరికాదని,ప్రభుత్వం వెంటనే టీచర్లను వైన్ షాపుల వద్ద విధుల్లో నుంచి ఉపసంహరించాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
In Vizag district officials appointed duty for local teachers at wine shops got severe criticism from everywhere after the news came into light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X