అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు - ఉద్రిక్తత..!!

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సభ ప్రారంభమైన సమయం నుంచి జీవో నెంబర్ 1పైన టీడీపీ నిరసనకు దిగింది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి విసిరేసారు. దీని పైన మంత్రులు..వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. మరణాల కారణంగానే ఈ జోవో అవసరమైందని వివరించారు.

స్పీకర్ చెబుతున్నా..టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. స్పీకర్ వారించినా వెనక్కు తగ్గలేదు. సభను అడ్డుకోవటం సరికాదంటూ వైసీపీ సభ్యులు చెప్పుకొచ్చారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ సభ్యుల తీరు పైన స్పీకర్ అసహనం వ్యక్తం చేసారు. స్పీకర్ ముఖం కనపడకుండా టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు ప్లకార్డు పెట్టటం పైన వైసీపీ సభ్యులు స్పందించారు. బీసీ స్పీకర్ ను అవమానించారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.

Team India in IPL mood fans slam team after second ODI loss

స్పీకర్ ముఖం పైన ప్లకార్డు పెట్టటంతో స్పీకర్ దానిని లాగి చింపి పడేసారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు రక్షణగా పోడియం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్సీ సంజీవయ్య టీడీపీ సభ్యుల మీద ఆగ్రహంతో ముందుకెళ్లారు. మంత్రి అంబటి ఆయన్ను అడ్డుకున్నారు. ఆ సమయంలో సుధాకర్ బాబు..డోలా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో స్పీకర్ వెంటనే కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయారు. స్పీకర్ తో టీడీపీ వ్యవహరించిన తీరు పైన అధికార పార్టీ సీరియస్ గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+