రోడ్డు ప్రమాదం: టెక్ మహీంద్రా ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
కృష్ణా: జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హెల్మెట్ ఉన్నప్పటికీ ఆ వాహనం బలంగా ఢీకొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం. కాగా, ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఇతడు కూడా టెక్ మహీంద్రా ఉద్యోగే. వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications