పుణేలో ఆంధ్రా టెక్కీ మృతి: వేధింపు, భర్తపై అనుమానం

నందిగామకు చెందిన సయ్యద్ లాలు, గుల్‌షద్‌ల కుమార్తె షేక్ ఖాజాబీ, ఖమ్మం జిల్లా మధుర మండలం ఖాజీపురానికి చెందిన షేక్ మునీబ్‌లు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖాజాబీ ఇన్ఫోసిస్‌లో సాఫ్టువేర్ ఉద్యోగిగా, మునీబ్ ఎల్ అండ్ టిలో పని చేస్తున్నారు. పెళ్లైన రెండేళ్ల నాటి నుంచి మునీబ్ కట్నం కోసం భార్యను వేధించడంతో పాటు మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు.
ఖాజాబీ తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. మూడు లక్షల రూపాయల నగదు, కొంత బంగారం అల్లుడికి ఇచ్చారు. ఆ తర్వాత భర్తకు ఉద్యోగం పోవడంతో పుణే ఎల్ అండ్ టిలో ఉద్యోగం వచ్చేలా ఖాజాబీ కృషి చేసింది. ఈ క్రమంలో ఆమె హైదరాబాదు నుండి పుణే ఇన్ఫోసిస్ బ్రాంచికి బదలీ చేయించుకున్నారు.
ఇటీవల డబ్బుల కోసం వేధించడంతో మరో రెండు లక్షలు ఆమె తల్లిదండ్రులు సర్దారు. భార్యపై అనుమానంతో కొంతకాలంగా మునీబ్ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఆమె శుక్రవారం ఉరేసుకొని మృతి చెందినట్లు తల్లిదండ్రులకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications