హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ రేప్: లైంగిక సామర్థ్య పరీక్షలకు కోర్టు అనుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపిన టెక్కీ అత్యాచారం కేసులో నిందితులకు మియాపూర్ కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగినిని కారులో అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

సతీష్, వెంకటేశ్వర్లులకు లైంగిక సామర్థ్యం పరీక్షలకు న్యాయస్థానం అనుమతించింది. కోర్టు పద్నాలుగు రోజుల రిమండు విధించడంతో నిందితులను సంగారెడ్డి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. ఐదు గంటల లోపు జైలుకు వెళ్లే అవకాశం లేనందున వారిని గురువారం ఉదయం పది గంటలకు సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు.

Software engineer gang rape

నిందితుల తరఫున వాదించవద్దని బార్ అసోసియేషన్ నిర్ణయం

సాఫ్టువేర్ ఉద్యోగిని అత్యాచారంకేసులో నిందితుల తరఫున వాదించకూడదని రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.

కాగా, టెక్కీ అభయను మూడు రోజుల క్రితం సతీష్, వెంకటేశ్వర్లు కారులో అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ రోజు మియాపూర్ న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చారు.

English summary
Two accused in the Software engineer gang rape case were on Wednesday remanded in judicial custody for 14 days by Miyapur court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X