మద్యం మత్తులో పడి ఉన్న యువతి: బాబాయ్, బంధువులు తాగించారని ఆరోపణ
విశాఖపట్నం: మద్యం మత్తులో విశాఖపట్నంలోని టోల్‌గేట్ ఓ యువతి మద్యం మత్తులో పడిపోయి ఉంది. ఈ స్థితిలో ఆమెను చూసిన స్థానికులు 108కి ఫోన్ చేశారు. దాంతో 108 సిబ్బంది వచ్చి ఆమెను విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో చేర్పించారు.
తన పేరు పింకీ అని, భువనేశ్వర్ నుంచి వచ్చానని ఆమె చెప్పింది. తనకు తన బాబాయ్, మరికొంత మంది బంధువులు బలవంతంగా మద్యం తాగించారని ఆమె చెప్పింది. పూర్తిగా మత్తులో ఉన్న ఆమెను చూసిన స్థానికులు తొలుత 108కి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

విజయనగరం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయకుడి ఊరేగింపు సందర్భంగా విద్యుత్తు షాక్‌కు గురై ఓ బాలుడు మరణించాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడులో శుక్రవారం వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జరిగింది.
ఊరేగింపు సందర్భంగా విద్యుత్ తీగ తెగిపడింది. అది తాకి పాతినవలస నాగరాజు అనే 13 ఏళ్ల బాలుడు మరణించాడు. పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శనివారం ఉదయం బాడంగి పిహెచ్‌సికి తరలించారు.












Click it and Unblock the Notifications