ఏపీని టెన్షన్ పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!

అన్ని రంగాలలోనూ పురోగమనం వైపు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఒక విషయంలో తిరోగమనంలో వెళుతుంది అన్నది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఒక విషయం ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో టీనేజ్ ప్రెగ్నెన్సీ పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.

ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీ

చదువుల వైపు వెళ్లాల్సిన యువత 13 ఏళ్ల నుండి 19 సంవత్సరాల మధ్య వయసులోనే గర్భం దాల్చడం భవిష్యత్తులో ఏపీ ప్రగతికి విఘాతంగా మారే అవకాశం ఉంది అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. చిన్నతనంలో గర్భం దాల్చడంతో ఆ చిన్నారుల జీవితం బాధ్యతల మధ్య బందీ అవుతుంది. ఈ ప్రభావం కుటుంబ ఎదుగుదలతో పాటు, రాష్ట్ర ప్రగతి పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

teenage pregnency is a big concern in ap cm chandrababu alert to health officials and concern depts

విపరీతంగా పెరిగిన ప్రెగ్నెన్సి రేటు

మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళనకరంగా ఉంది .ఈ జిల్లాలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది . రాయలసీమ, దక్షిణ కోస్తా తీరప్రాంతాలలో పరిస్థితి మరింత అదుపుతప్పి టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు విపరీతంగా పెరిగింది. అక్కడ బాల్యవివాహాలు చేయడం, తెలిసి తెలియని వయసులో చేసే పొరపాట్లు, అత్యాచారాలు వంటి సంఘటనలు వెరసి అందమైన ఆడపిల్లల బాల్యం గర్భధారణ తో చిదిమేయబడుతుంది.

అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ వస్తే మాత, శిశు మరణాల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అన్ని రంగాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటీవల జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖ తో పాటు ఇతర కీలక శాఖలను కూడా ఈ అంశం మీద అప్రమత్తం చేసి దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యతను సూచించారు.

ఆ జిల్లాలో అత్యధికంగా టీనేజ్ ప్రెగ్నెన్సి

సహజంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ లక్ష్యం సున్నా స్థాయిలో ఉండాలి. కానీ దీనిని 2025 -2026లో ఐదు శాతానికి తగ్గించాలని అధికారులు నిర్దేశించారు. అధికారులు నిర్దేశించిన దానికంటే తక్కువ స్థాయిలో విశాఖలో 3.98 శాతం టీనేజ్ ప్రెగ్నెన్సీ నమోదు కాగా, మిగిలిన జిల్లాలలో ఐదు శాతం నుంచి 12 శాతం అంతకంటే ఎక్కువగా సమస్య కనిపించింది. ఇక పల్నాడులో 14.94శాతం, కర్నూలు జిల్లాలో 13.50శాతం టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయి.

పురోగతి తర్వాత తిరోగమనంలో వెళ్ళకుండా చూడండి

కీలక శాఖలు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి మాట అటుంచి తిరోగమనంలోకి వెళుతుంది అన్నది మాత్రం అక్షర సత్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+