వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభ సీట్లు: ఖమ్మంలో వైకాపా, తెలంగాణలో విజేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శానససభ స్థానాల్లో కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ ఎన్నికల్లో కూడా విజయదుందుభీ మోగిస్తోంది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే తెరాస ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తోంది. కాంగ్రెసు దిగ్గజాలను మట్టి కరిపిస్తూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు.

మెదక్ - కె. చంద్రశేఖర రావు (తెరాస)

మహబూబ్‌నగర్ - జితేందర్ రెడ్డి (తెరాస), కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

మహబూబాబాద్ - సీతారాం నాయక్ (తెరాస), కేంద్ర మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు.

నాగర్‌కర్నూలు - నంది ఎల్లయ్య (కాంగ్రెసు), తెరాస అభ్యర్థి మందా జగన్నాథం 4,800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు ఆయన తెరాసలో చేరారు.

పెద్దపల్లి - బాల్క సుమన్ (తెరాస), సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు అభ్యర్థి జి. వివేక్ ఓటమి పాలయ్యారు. వివేక్ తొలుత కాంగ్రెసు నుంచి తెరాసలో చేరి, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తిరిగి కాంగ్రెసులోకి వెళ్లారు.

నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత (తెరాస), సిట్టింగ్ ఎంపి, కాంగ్రెసు అభ్యర్థి మధు యాష్కీ ఓటమి పాలయ్యారు.

భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ (తెరాస), కాంగ్రెసు అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

కరీంనగర్ - వినోద్ కుమార్ (తెరాస)

Kadiyam - Rajaiah

వరంగల్ - కడియం శ్రీహరి (తెరాస), కాంగ్రెసు అభ్యర్థి, సిట్టింగ్ ఎంపి రాజయ్య ఓటమి

నల్లగొండ - గుత్తా సుఖేందర్ రెడ్డి (కాంగ్రెసు)

ఆదిలాబాద్ - నగేష్ (తెరాస)

చేవెళ్ల - కొండా విశ్వేశ్వర రెడ్డి (తెరాస), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఓడిపోయారు.

హైదరాబాద్ - అసదుద్దీన్ ఓవైసీ (మజ్లీస్)

సికింద్రాబాద్ - బండారు దత్తాత్రేయ (బిజెపి)

జహీరాబాద్ - బిబి పాటిల్ (తెరాస)

ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వైకాపా)

మల్కాజిగిరి - మల్లారెడ్డి (టిడిపి)

English summary
Telangana Rastra Smaithi (TRS) candidates like Kadiyam Srihari won for Lok Sabha in Telanagna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X