విడివిడిగా...: అసెంబ్లీకి శ్రీధర్ డుమ్మా, రిజైన్‌పై గవర్నర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టనున్నారు. సమైక్య తీర్మానం కోసం తాము సభను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. బిజెపి, టిటిడిపి, తెరాస, సిపిఐలు చర్చకు పట్టుబట్టనున్నాయి. మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబు అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
సభ వాయిదా
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం విపక్షాలు సభాపతికి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ టిడిపి, సమైక్య తీర్మానం కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా, ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైంది. వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. సభలో ఇరు ప్రాంతాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అరగంటపాటు వాయిదా వేశారు. సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సమైక్యాంధ్ర తీర్మానాలు చేశారు.
శ్రీధర్ రాజీనామా రాలేదన్న గవర్నర్
మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబు రాజీనామా తన వద్దకు రాలేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు.
సీమాంధ్రలో బంద్
తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో సీమాంధ్రలో బందు కొనసాగుతోంది. ఈ రోజు బందుకు ఎపిఎన్జీవోలు, వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications