కృష్ణాపై తెలంగాణ, ఎపి మధ్య మరోసారి గొడవ
హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి వివాదానికి తెర తీసింది. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి నిలిపేయాలని నిశ్చయించింది. రబీ పంటకు కుడి కాలువ కింద నీటిని విడుదల చేయలేమని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు స్పష్టం చేశారు.
ఇప్పటికే కేటాయించినదాని కన్నా ఎక్కువగా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుందని ఆయన చెప్పారు. ఎపి ప్రభుత్వం అదనంగా 44 టిఎంసిల నీటిని వాడుకుందని ఆయన చెప్పారు. అందువల్ల నాగార్జన సాగర్‌లో నీటి మట్టం తగ్గిందని ఆయన అన్నారు. కాగా, కృష్ణా జలాలపై స్పష్టత వచ్చే వరకు కుడి కాలువకు నీటిని విడుదల చేయకూడదని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు అవససరాలు ఉంటే తమకు లేఖ రాస్తే పరిశీలిస్తామనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ తాజా నిర్ణయంతో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగే అవకాశం ఉంది.

నెక్లెస్ రోడ్డులో కాకా స్మారకం
నెక్లెస్ రోడ్డులో మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి స్మారకం నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నిర్ణయించారు. విగ్రహం ఏర్పాటు సహా సభల నిర్వహణకు వీలుగా నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. స్మారక నిర్మాణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారటీకి ముఖ్యమంత్రి అప్పగించారు. వెంకటస్వామి జయంతి నాటికి స్మారక నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వెంకటస్వామి కుమారుడు వివేక్ బుధవారంనాడు కెసిఆర్‌ను కలిసి విషయం తెలిసిందే.
విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీ
విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 1948 మంది ఏఈలు, 733 మంది సబ్ ఇంజినీర్ల నియామకానికి నిర్ణయించారు. మొత్తం 2,681 మంది ఇంజినీర్లను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.












Click it and Unblock the Notifications