అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జగన్..!!
KCR resign: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని అన్నారు.
ఈ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 38 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు తెలంగాణ ఓటర్లు. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించారు. ఈ సారి ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఇచ్చారు. మొత్తంగా 66 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ ప్రభంజనం ముందు ఆరుమంది మంత్రులు సైతం మట్టికరిచారు.
ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. రాజ్‌భవన్‌కు వెళ్లలేదు కేసీఆర్. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పీ రాజశేఖర్ రెడ్డి.. రాజ్ భవన్‌కు వెళ్లి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు.
అటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. ఈ రెండు చోట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని సీట్లను సాధించింది.
ఈ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ రెండు పార్టీలనూ అభినందించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లల్లో విజయం సాధించిన బీజేపీకి విషెస్ తెలిపారు జగన్. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్‌కు అభినందిస్తూ ట్వీట్ చేశారాయన.












Click it and Unblock the Notifications