టి ఆగదు, మోసగించినట్లే: డొక్కా, కిరణ్‌పై పాల్వాయి ఫైర్

సీమాంధ్రలోని రైతులు, ఎస్సీలు, ఎస్టీలు నష్టపోకుండా ఉండేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. సీమాంధ్ర ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదిక ఇస్తామని చెప్పారు. పల్నాడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు.
కిరణ్ పైన పాల్వాయి నిప్పులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వమనేదే లేదన్నారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి సమాధి కడుతుంటే అడ్డుకోలేక పోయారన్నారు. ముఖ్యమంత్రి పైన పోటో కేసు పెట్టాలని ధ్వజమెత్తారు.
స్పీకర్‌ను కలిసేందుకు లగడపాటి యత్నం
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ న్యూఢిల్లీలో సభాపతి మీరా కుమార్‌ను కలిసి రాజీనామా ఆమోదింప చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో లగడపాటి సెక్రటరీ జనరల్‌ను కలిశారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని లగడపాటికి అతను సూచించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications