అన్నా రేవంత్ రెడ్డి ఎవరో తెలిసిందా ?, లోటస్ పాండ్ దెబ్బకు వైసీపీలో ఆ లీడర్స్ సైలెంట్ !
తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి అని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. అయితే రేవంత్ రెడ్డి ఎవరు ?, ఆయనకు మాకు ఏమిటి సంబంధం, ఆయనది ఏ పార్టీ, మాది ఏ పార్టీ, ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే మేము ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలి అంటూ కొంతకాలం నిర్లక్షంగా మాట్లాడిన కొందరు వైసీపీ నాయకులకు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చుక్కలు చూపించింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కొందరు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరండి, పక్క రాష్ట్రంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే మేము ఎందుకు అక్కడికి వెళ్లాలి, ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి, మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాది వైఎస్ఆర్ సీపీ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఇలా మాట్లాడారు.

ఇప్పుడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఇంటి ముందు అక్రమంగా నిర్మించిన కట్టడాలను జీహెచ్ ఎంసీ అధికారులు తొలగించారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి చూసిచూడనట్లు వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు సీఎం పదవి పోవడంతో ఓసారి సినిమా చూపించాలని అనుకున్నట్లు ఉంది.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ చెక్ పోస్టులను జీహెచ్ ఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా కట్టడాలు నిర్మించారని పలువురు ఫిర్యాదులు చేశారని, అక్రమ కట్టడాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి నోటీసులు ఇచ్చామని, తరువాత వాటికి కూల్చేశామని జీహెచ్ ఎంసీ అధికారులు అంటున్నారు.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేయడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరో ? అనే విషయం కొడాలి నానితో పాటు తెలంగాణ సీఎం గురించి మాట్లాడిన వైసీపీ నాయకులకు తెలిసి ఉంటుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నోరు ఉందికదా అని వెనుకా ముందు ఆలోచించకుండా మాట్లాడిన కొడాలి నానితో పాటు కొందరు వైసీపీ నాయకులు ఇప్పుడు నోరుకూడా మెదపకుండా సైలెంట్ గా ఉండిపోయారని తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications