అక్రమ కూల్చివేతలు: ల్యాంకో హిల్స్‌పై ప్రభుత్వ దృష్టి

అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. మణికొండలోని ల్యాంకోహిల్స్ భూముల వివరాలను సేకరించి నివేదిక పంపాలని ఆదేశించడంతో గురువారంనాడు రాజేంద్రనగర్ మండల తహశీల్దార్ (డిప్యూటీ కలెక్టర్) కె. చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవీందర్ దత్తు, విఆర్వో చంద్రారెడ్డి ల్యాంకోహిల్స్‌ను సందర్శించారు.
పూర్తి సమాచారంతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే మణికొండలోని సర్వే నంబర్ 201, 193లో ఉన్న మైసమ్మ కుంటను, పుప్పాల్‌గూడలోని భారతమ్మ (భగిరథ) చెరువును ఆయన పరిశీలించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మణికొండలో ప్రతిష్ఠాత్మకంగా ల్యాంకో హిల్స్ ప్రాజెక్టును చేపట్టారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపై టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, రాజగోపాల్‌ల మధ్య అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రగడ జరిగిన సంగతి తెలిసిందే.
మణికొండలో అత్యాధునిక సౌకర్యాలతో నివాస సముదాయాల నిర్మాణంతో ఐటీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నుంచి ల్యాంకో సంస్థ వేలంలో కొనుగోలు చేసింది. అయితే అప్పట్లోనే ఈ భూములు వక్ఫ్‌కు చెందినవని వివాదం తలెత్తింది. దీనిపై కొంత మంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications