గురుకుల్‌పై సీరియస్: అన్ని వైపుల నుంచీ షాక్
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టు భూములపై తెలంగాణ ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి సాగిస్తోంది. వారం క్రితం గురుకుల్ ట్రస్టు భూములపై చర్యలు ప్రారంభమయ్యాయి. స్థలాల స్వాధీనమే లక్ష్యంగా తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రభుత్వం ప్రయోగిస్తోంది.
ప్రభుత్వ చర్యలతో అయ్యప్ప సొసైటీ వాసులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎమ్‌సీ కూల్చివేసింది. తాజాగా ప్రభుత్వం ఆదేశాలతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, జీహెచ్‌ఎమ్‌సీ ప్లాన్ డాక్యుమెంట్లు సమర్పించాలంటూ వాటర్‌బోర్డు ప్రజలపై నీళ్లు కుమ్మరించేసింది. అనుమతి లేదంటూ మూడు రెట్లు అదనంగా బిల్లులిచ్చి ట్రాన్స్‌కో షాకిచ్చింది.

అవన్నీ ప్రభుత్వ భూములేనంటూ మైకులో ప్రచారమూ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారికి జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీవాసులు ఓ వైపు ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తూనే మరోవైపు నిరసనలకూ దిగుతున్నారు. నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ బోనాల పండుగ నిర్వహించారు.
కాపాడమంటూ సొసైటీ కార్యాలయంలో ఉన్న దుర్గామాతకు బోనాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications