వర్మ వ్యూహంలో మరో ట్విస్ట్? హైకోర్టు ముందుకు కీలక పాయింట్! నేడు నిర్ణయం..

ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై రూపొందించిన వ్యూహం చిత్రాన్ని వచ్చే ఎన్నికల ముందు ఎలాగైనా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యూహం చిత్ర యూనిట్ ఇప్పుుడ మరో కొత్త పాయింట్ పట్టుకుంది.

గతంలో ఈ చిత్రం విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఉన్న ఓ లొసుగు ఆధారంగా ఈ పాయింట్ ను తెరపైకి తెచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకుని చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది.

telangana high court to decide release of rgvs vyuham movie on ys jagan today

సీఎం జగన్ జీవితంలో కొన్ని కీలక రాజకీయ ఘట్టాల్ని తీసుకుని నిర్మించిన వ్యూహం చిత్రంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీకి రాజకీయంగా మేలు చేసే విధంగా ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్డి ఈ చిత్రం విడుదలపై స్టే ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం చిత్రం రిలీజ్ కు బ్రేక్ పడింది.

దీనిపై నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ యు సర్టిఫికెట్ జారీ చేయడంపై కారణాలు వెల్లడించాలని కోరడం సరికాదని హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు కొత్త వాదన తెచ్చారు. సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ ఈ చిత్రానికి ఏ, ఏ బై యూ సర్టిఫికెట్ జారీ చేసినప్పుడు మాత్రమే కారణాలు చెప్పాల్సి ఉంటుందని నిర్మాతలు వాదిస్తున్నారు. దీనిపై నిన్న వాదనలు పూర్తి కాకపోవడంతో హైకోర్టు.. ఇవాళ్టికి విచారణ వాయిదా వేసింది. దీనిపై ఇవాళ కూడా వాదనలు విన్నాక హైకోర్టు తుది నిర్ణయం ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+