బిజెపి ఆఫీస్‌పై టి జాగృతి దాడికి యత్నం: అరెస్టులు

Telangana Jagriti leaders tries to attack on BJP office
హైదరాబాద్: నగరంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంపై పలువురు తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్రక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిరసనగా ఈ దాడికి యత్నించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తెలంగాణ జాగృతి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బిజెపి కార్యాలయం గేట్లు దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శుక్రవారం జరిగిన లోకసభ సమావేశాల్లో పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపిలో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జెఏసి, వామపక్షాలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో శనివారం తెలంగాణ వ్యాప్తంగా శనివారం బంద్ నిర్వహించారు. పలుచోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు, టి జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+