సిఎస్‌పై ప్రివిలేజ్ మోషన్: డిగ్గీపై కిరణ్, మంగళయాన్‌లా..
హైదరాబాద్: తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చాయి. శుక్రవారమే తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపించాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిటిడిపి, బిజెపి, తెరాస, సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు సిఎస్ పైన సభా హక్కుల నోటీసును ఇచ్చారు.
మరోవైపు అసెంబ్లీ వాయిదా అనంతరం ప్రారంభమైనప్పటికీ ఇరు ప్రాంతాల నేతలు సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

డిగ్గీపై కిరణ్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలను విడగొట్టలేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సీమాంధ్ర నేతలతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది విభజన బిల్లులో తప్పులు ఉన్నాయని, ప్రస్తుతం అసెంబ్లీలో ఆమోదం పొందడం కష్టమని ఆయన చెప్పారట. సీమాంధ్ర నేతలతో కిరణ్ భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాచారం మేరకు... విభజన బిల్లుపై ప్రాంతాల వారీగా అభిప్రాయాలు చెప్పకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. ప్రత్యేక విమానంలో బిల్లు స్పీడ్‌గా వచ్చిందని, అంతే స్పీడుగా మంగళయాన్‌లా వెనక్కి పంపిద్దామన్నారు.
మంగళయాన్ గమ్యం చేరేందుకు ఆరు నెలల సమయం పడుతుంది. విభజన బిల్లు పరిస్థితి అంతే అన్నారు. 371 డి పైన శాసన సభలో సవరణ కోరినట్లు తెలిపారు. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజార్టీ కష్టసాధ్యమన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో విప్ ఉండదని డిగ్గీ చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications