వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమయం తక్కువ, త్వరగా టి: షిండే, సిఎం లేఖపై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం అన్నారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మధ్యాహ్నం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు తాము లేఖలు రాశామన్నారు. మంత్రుల బృందం(జివోఎం) విధివిధానాల పైన అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ పైన స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అదే సమయంలో కిరణ్ లేఖ పైన తాను రాష్ట్రపతికి వివరణ ఇవ్వలేదని చెప్పారు.

కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖపై వివరణ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ బద్దంగానే విభజన జరుగుతందని రాష్ట్రపతికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

జివోఎం విధివిధానాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరామని, పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అఖిలపక్ష తేదీలు ఖరారు చేస్తామని షిండే చెప్పారు.

మరోవైపు ఈరోజు రాష్ట్రంలోని ప్రధాన ఎనిమిది రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి లేఖలు రాసిన విషయం తెలిసిందే. నవంబర్ ఐదవ తేదీలోగా జీవోఎం విధివిధానాలపై అభిప్రాయాలు తెలపాలని హోంశాఖ కోరింది.

English summary
Central Home Ministe Sushil Kumar Shinde on Thursday said Telangana process will be completed quickly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X