వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం బ్యారేజ్ 20 గేట్లు ఎత్తి.. వృధాగా సాగునీరు సముద్రంలోకి, తెలంగాణా 'పవర్' షాక్ తో అసహనంలో ఏపీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణా ప్రభుత్వం పవర్ ఫుల్ షాక్ ఇచ్చింది. నీటిని ముందస్తుగా విడుదల చేసి ఏపీ వాడుకోలేని పరిస్థితి కల్పించింది. నిరర్ధకంగా కృష్ణా జలాలు సముద్రంలో కలిసేలా చేసింది. ఏపీ రాయలసీమ ప్రాజెక్ట్ పై అభ్యంతరం తో మొదలైన తెలుగురాష్ట్రాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. తెలంగాణాతీరుతో అసహనంలో ఉన్న ఏపీ లేఖాస్త్రాలు సందిస్తుంది. కేంద్రాన్ని జోక్యం చేసుకోమని కోరుతోంది. తెలంగాణా విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఏపీ అభ్యంతరాలను సైతం లెక్క చెయ్యకుండా తెలంగాణా ఏపీకి తీరని నష్టం చేస్తుంది.

ముదురుతున్న పవర్ వార్ : సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాం, పవర్ ప్లాంట్స్ వద్ద భారీగా పోలీస్ బలగాలుముదురుతున్న పవర్ వార్ : సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాం, పవర్ ప్లాంట్స్ వద్ద భారీగా పోలీస్ బలగాలు

 మొండిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణా

మొండిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణా


తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. జల విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దూకుడు చూపిస్తోంది. ఏపీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జూరాల నుంచి పులిచింతల దాకా అన్ని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుతో ప్రకాశం బ్యారేజి నుండి నీటిని సముద్రంలోకి వృధాగా వదలాల్సిన పరిస్థితి నెలకొంది.

20 గేట్ల ద్వారా 8340 క్యూసెక్కుల నీటి విడుదల.. వృధాగా పోతున్న సాగునీరు

20 గేట్ల ద్వారా 8340 క్యూసెక్కుల నీటి విడుదల.. వృధాగా పోతున్న సాగునీరు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఉత్పత్తి నిర్ణయంతో పులిచింతల ప్రాజెక్టు సగానికి పైగా ఖాళీ అయింది. విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీకి వరద బాగా పెరిగింది. మొత్తం 20 గేట్ల ద్వారా 8340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండటంతో అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితిలో సముద్రంలోకి వదిలి పెడుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

 విధిలేని పరిస్థితిలో నీరు విడుదల చేస్తున్నామన్న అధికారులు

విధిలేని పరిస్థితిలో నీరు విడుదల చేస్తున్నామన్న అధికారులు

విధిలేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తెలంగాణ నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించి, మిగతా వాటిని దిగువకు రిలీజ్ చేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి బాగా నీళ్ళు వస్తున్నాయని, అనవసరంగా ఇప్పుడు నీటిని విడుదల చేయడం వల్ల అటు రైతాంగానికి ఉపయోగపడకుండా, నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది చెప్తున్నారు.

విద్యుత్ ఉత్పత్తికి పోగా మిగిలిన నీరు దిగువకు విడుదల చేసిన తెలంగాణా

విద్యుత్ ఉత్పత్తికి పోగా మిగిలిన నీరు దిగువకు విడుదల చేసిన తెలంగాణా

ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 39,700 క్యూసెక్కుల నీరు చేరుతోందని, పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 7,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోందని వెల్లడించారు .ఇక నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల అవుతుంది. ఏది ఏమైనా నదీజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇంకా ఖరీఫ్ కు సిద్ధం కాకముందే నీటిని విడుదల చేయడంతో నదీజలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయి.

English summary
With the decision of the Telangana government to generate electricity, more than half of the Pulichintala project became vacant. Prakasam Barrage in Andhra Pradesh has been hit hard by floods as water is being released downstream after power generation. A total of 8340 cusecs of water had to be released into the sea through 20 gates. Water Resources Department officials said the barrage currently has a full-scale water storage of 3.07 TMC, leaving excess water in the sea in a state where it cannot be stored.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X