అసెంబ్లీలో తెలంగాణనే ఎజెండా: మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్/ హైదరాబాద్: రాష్ట్ర విభజనే ప్రధాన అజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 2కే రన్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

విభజనపై ఎవరు వ్యతిరేకించినా అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. మద్దతు ఇస్తామన్న పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని అంటూ విభజనకు పార్టీలు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. శాసనసభలో రాజ్యాంగబద్గంగానే తెలగాణ ఎజెండాను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు దీనికి అందరూ సహకరించాలని కోరారు.

Sridhar Babu

సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శ్రీధర్ బాబు సోనియా గాంధీ పేరుతో ఉన్న భారీ కేకును కట్ చేశారు. అంతకుముందు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహానికి, తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతపై వారు చర్చించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+