వంగవీటి రాధాపై సంచలన కామెంట్స్ చేసిన సినీ నటి

టీడీపీ కీలక నేత వంగవీటి రాధాపై ప్రముఖ సినీ నటి లతశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి రాధాకు సంబంధించిన ఆస్పత్రిలో చేర్చడం వల్లే తన అమ్మ చనిపోయిందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ య్యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన లతశ్రీ తన తల్లి మరణానికి గురించిన కారణాలు తెలియజేశారు. మా అమ్మగారికి గుండె నొప్పి రావడంతో విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చేర్పించామని లతశ్రీ తెలిపారు.

మూడు రోజుల్లో కోలుకున్న అమ్మ మాతో బాగానే మాట్లాడారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుందనుకున్న అమ్మ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని లతశ్రీ తెలిపింది. ముందురోజు బాగానే ఉన్న అమ్మ అనుహ్యంగా కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు చెప్పడంతో తాను షాక్ అయ్యానని..మాతో సరదాగా మాట్లాడిన అమ్మకు ఏమైందని డాక్టర్లను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆమె తెలిపింది.

telugu actress latha sri shocking allegations on vangaveeti radha

బ్రెయిన్‌కు ఇంజెక్షన్స్ చేస్తున్నామని చెప్పి.. మా దగ్గన భారీగా డబ్బులు వసూలు చేశారని లతశ్రీ ఆరోపించింది. ఆస్పత్రిలో పని చేసే సిబ్బందే ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని తనని ప్రశ్నించారని..ఇక్కడ డబ్బులు గుంజేస్తారు తప్ప ట్రీట్మెంట్ సరిగా ఉండదని చెప్పడంతో తాను కంగుతిన్నానని లతశ్రీ తెలిపింది.

వెంటనే హెల్ప్ ఆస్పత్రి యాజమాని అయిన వంగవీటి రాధాను పలుమార్లు కలిసి పరిస్థితి వివరించానని..ఆయన డాక్టర్లు చూసుకుంటారు కంగారు పడవద్దని మమ్మల్ని అక్కడ నుంచి పంపించేశారని ఆమె చెప్పుకొచ్చింది. హెల్ప్ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి మార్చాలని చూసినప్పటికీ లాభం లేకుండాపోయిందని.. చివరికి 18 రోజులు పోరాడిన మా అమ్మ చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

హెల్ప్ ఆస్పత్రి కాకుండా మరో హస్పటల్‌లో చేర్పించి ఉంటే మా అమ్మ బ్రతికి ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. హెల్ప్ ఆస్పత్రి డాకర్లు, యాజమాన్యం వ్యవహరించిన తీరే కారణంగానే అమ్మ చనిపోయిందంటూ లతశ్రీ ఆరోపించింది. డబ్బులు తీసుకోవడం తప్పిస్తే అక్కడ సరైన చికిత్స లేదని..మా అమ్మగారి విషయంలో ఇది స్పష్టమైందంటూ ఆమె తెలిపింది. వంగవీటి రాధాపై నటి లతశ్రీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+