వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చేతికి చిక్కుకుంటున్న ''తెలుగు సినిమా''?

|
Google Oneindia TeluguNews

మనం బలహీనులైనప్పటికీ బలవంతుల పక్కన నిలబడితే మనల్ని కూడా బలవంతులుగానే భావిస్తారు. అలాగే తనకు బలం లేనిచోట భారతీయ జనతాపార్టీ అచ్చం ఇదే సూత్రాన్ని అనుసరిస్తోంది. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ నెమ్మ‌దిగా, త‌న‌కు తెలియ‌కుండా బీజేపీ చేతుల్లో చిక్కుకు పోతోంది. ఉత్త‌రాదిలో గ‌ట్టి ప‌ట్టున్న‌ప్ప‌టికీ త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన ద‌క్షిణాదిలో పాగా వేయాలనేది ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దల ప్రణాళిక. స్వతహాగా పునాది లేనిచోట ఆ పార్టీకి ఒక్కసారిగా స్టార్ డ‌మ్ కావాలంటే స్టార్సే ఆ పని చేయగలరు.

పావులు కదుపుతున్న బీజేపీ

పావులు కదుపుతున్న బీజేపీ


ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌లో ఆ పార్టీకి పేరున్న రాజ‌కీయ నేత‌లు లేరు. ముందుగా ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లాలంటే సినీ స్టార్స్ అయితేనే వీలనేది బీజేపీ భావన. వారిని ఉప‌యోగించుకొని పునాదిని బలంగా వేసుకోవాలనే యోచ‌న చేస్తోంది. అందుకు త‌గ్గ‌ట్లుగా నెమ్మ‌దిగా పావులు క‌దుపుతోంది. ర‌జ‌నీకాంత్‌ను ద‌రిచేర్చుకునే ప్ర‌య‌త్నాలు ఆరంభించారు. మోడీ, అమిత్ షా ఒత్తిడి మేర‌కే ర‌జ‌నీకాంత్ పార్టీ పెట్టాల‌నే నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు.

 అనేక చర్చలకు దారితీసిన భేటీ

అనేక చర్చలకు దారితీసిన భేటీ


కేర‌ళ‌లో మోహ‌న్ లాల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉండ‌టంతో ఇక్క‌డ సినీ స్టార్స్ తో అవసరం లేదు. అయినా వ‌చ్చిన‌వారిని కాద‌న‌డంలేదు. త‌నంత‌ట తానుగా ఎవ‌రినీ ఇత‌ర రాష్ట్రాల్లో ఆహ్వానించిన‌ట్లుగా కర్ణాటకలో ఆహ్వానించాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూనియ‌ర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీ అనేక రకాల చర్చలకు దారితీసింది. తాజాగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో నితిన్ భేటీ అయ్యారు. వాస్త‌వారిని వీరు మ‌ర్యాద పూర్వ‌కంగానే క‌లిశారు. కానీ ఈ క‌ల‌యిక భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక స్టార్ డ‌మ్ లేని పార్టీకి స్టార్ హోదా వ‌స్తుంది. ప్ర‌జ‌ల్లోకి వేగంగా చొచ్చుకెళ్ల‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

 అందరూ బీజేపీ మద్దతుదారులే

అందరూ బీజేపీ మద్దతుదారులే


తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ బీజేపీకి మ‌ద్ద‌తుదారు. అంటే ఆయ‌న కుమారుడు రాజమౌళి, ఇతర కుటుంబ సభ్యులంతా మ‌ద్ద‌తుగా ఉన్న‌ట్లు భావించ‌వ‌చ్చు. ఇటీవ‌లే భీమ‌వ‌రంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప‌వ‌న్ కల్యాణ్ ఎటూ మిత్ర‌ప‌క్షంగానే కొన‌సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ రేపో మాపో మిత్ర‌ప‌క్ష‌మ‌య్యే సూచ‌న‌లు క‌న‌ప‌డుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన మోహ‌న్‌బాబు కుటుంబం ఇప్పటికే మోడీని ఆకాశానికి ఎత్తేసింది. కాబ‌ట్టి దాదాపుగా చిత్ర ప‌రిశ్ర‌మ బీజేపీ చేతిలో ఉన్న‌ట్లుగానే భావించ‌వ‌చ్చు. భవిష్యత్తులో ఎవరు ఎవరిని ఎలా ఉపయోగించుకోబుతున్నారనేదే అసలైన ప్రశ్న. దీనికి కాలమే సమాధానం చెప్పనుంది. అప్పటివరకు వేచిచూడటమే మనం చేయాల్సిన పని.!!

English summary
Telugu film industry is slowly and unknowingly getting caught in the hands of BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X