గంటా, అయ్యన్నల మధ్య భగ్గుమన్న విభేదాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాస రావు, సిహెచ్ అయ్యన్న పాత్రుడు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరువురి మధ్య విభేదాలు వీధికెక్కాయి. నర్సీపట్నంలోని ఆర్టీసికి చెందిన 1.5 ఎకరాల స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణం కాంట్రాక్టును ప్రత్యూష ఆసోసియేట్స్ దక్కించుకుంది.
ప్రత్యూష అసోసియేట్స్‌తో గంటా శ్రీనివాస రావుకు ఇంతకు ముందు సంబంధం ఉండేది. అందుకే తగిన అర్హత లేనప్పటికీ ఆ సంస్థకు గంటా శ్రీనివాసరావు కాంట్రాక్టు ఇప్పించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నిజానికి, ఇరువురు మంత్రులకు పరస్పరం పడదు.

కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గతవారం ఇరువురు కలిసి పనిచేశారు. విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని చంద్రబాబు వారికి హితబోధ చేసినట్లు తెలుస్తోంది. అయితే, నిర్మాణ రంగంలో ప్రత్యూష అసోసియేట్స్‌కు అనుభవం లేదని అయ్యనపాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఆర్టిసి ఎండికి లేఖలు రాసినట్లు సమాచారం.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బిడ్డింగులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ కారణంగానే ప్రత్యూష అసోసియేట్స్‌కు కాంట్రాక్టు దక్కిందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications