Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీపై కేంద్రం కొత్త ప్రయోగాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో ఏపీలో భారీ పెట్టుబడులను సాధించడానికి కసరత్తు మొదలుపెట్టింది.

డిఫెన్స్, ఏరోస్పేస్ తయారీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. వివిధ అంశాలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.

Telugu Desam MPs met Defence Minister Rajnath Singh

రాష్ట్రంలో రక్షణ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనను వారు మంత్రికి అందజేశారు. లావు శ్రీ కృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, దగ్గుమళ్ళ ప్రసాదరావు.. రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రాష్ట్రంలో రక్షణ రంగానికి చెందిన యూనిట్లను నెలకొల్పాలని కోరారు.

చంద్రబాబు రాసిన రెండు లేఖలను కూడా వారు రాజ్ నాథ్ సింగ్ కు అందజేశారు. ఈ లేఖల్లో సమగ్ర రక్షణ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. జగ్గయ్యపేట-దొనకొండ (6,000 ఎకరాలు) మధ్య మిస్సైల్, ఇతర మందుగుండు సామగ్రి ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలని కోరారు.

విమానాలు- రక్షణ ఎలక్ట్రానిక్స్ కోసం లేపాక్షి-మడకశిర (10,000 ఎకరాలు), నావికా పరికరాలు- ఆయుధాల పరీక్ష కోసం విశాఖపట్నం-అనకాపల్లి (3,000 ఎకరాలు), డ్రోన్లు, రోబోటిక్స్, అధునాతన భాగాల కోసం కర్నూలు-ఓర్వకల్లు (4,000 ఎకరాలు) వంటి నాలుగు రక్షణ, ఏరోస్పేస్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఐఐటీ తిరుపతిలో డీఆర్‌డీఓ ఇండస్ట్రీ-అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా కామన్ అమ్యూనిషన్ స్టోరేజీ పాలసీ గురించి కూడా ముఖ్యమంత్రి ఈ లేఖలో పేర్కొన్నారు. పాలసముద్రంలో బీఈఎల్ స్ట్రాటజిక్ కాంప్లెక్స్ కోసం రూ. 2,400 కోట్లను కేటాయించాలని కోరారు.,

నెల్లూరులో యుఏడీఎన్ఎల్ కు చెందిన 60,000 టీపీఏ అల్యూమినియం మిశ్రమాల ప్లాంట్‌ను పునరుద్ధరించడం, హెచ్‌ఏఎల్ కు చెందిన ఎల్‌సీఏ అండ్ ఎల్‌సీహెచ్ విస్తరణకు భూమి/మౌలిక సదుపాయాలు, క్షిపణి సమీపంలోని దొనకొండలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్, లేపాక్షి-మడకశిరలో అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

యూఏవీ పరీక్షా కేంద్రాలు విశాఖపట్నంలో నావల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ), శిక్షణ సౌకర్యం, ఈఎన్సీ, ఎన్ఏఓబీకి మద్దతు వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షణ పరిశ్రమల వ్యవస్థను సృష్టించే ప్రతిపాదనలో భాగంగా, సమగ్ర రక్షణ వ్యవస్థను రూపొందించడానికి నీతి ఆయోగ్, పరిశ్రమ నిపుణులు, డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డితో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+