చంద్రబాబు దగ్గర 'పెన్‌డ్రైవ్' లో వైసీపీ జాతకం?

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, చంద్రగిరి, తిరుపతితోపాటు పలు నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులను బదిలీ చేసి కొత్తవారిని నియమించడంతోపాటు 13 మంది ప్రత్యేక అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ పూర్తిచేసిన సిట్ నివేదికను ఈసీకి పంపించింది.

కేంద్రం నుంచి అందుతున్న సాయం
ఈ తరుణంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. వాస్తవానికి చంద్రబాబునాయుడు లేఖ రాసిన తర్వాతే చర్యలు ప్రారంభమయ్యాయి. అల్లర్ల వెనక వైసీపీ ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పడంలో టీడీపీ విజయవంతమైంది. కేంద్ర పెద్దల నుంచి అందుతున్న సాయంతో వైసీపీ దూకుడుకు చెక్ పెట్టింది.

telugu desam party chief chandrababunaidu pen drive plan

పెన్ డ్రైవ్ తో పైచేయి
ఎన్నికలు జరిగినరోజు, ఆ తర్వాత రెండురోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో ఒక పెన్ డ్రైవ్ ను రూపొందించింది. కీలక విషయాలను అందులో పొందుపరిచింది. విచారణకు నేతృత్వం వహిస్తున్న ఐజీ వినీత్ బృందానికి దీన్ని అందజేసింది.

నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వర్ల రామయ్య ఈ పెన్ డ్రైవ్ ను సిట్ ప్రధాన అధికారికి అందజేయడంతోపాటు హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పెన్ డ్రైవ్ ప్లాన్ తో వైసీపీపై పైచేయి సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+