వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు ఇవ్వాల‌నుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాలు?

|
Google Oneindia TeluguNews

2021 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ప‌లు కార‌ణాల‌ను చెబుతున్న‌ప్ప‌టికీ అంతిమ విజ‌యం కోసం ఇప్ప‌టినుంచే హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిపక్షాలైన తెలుగుదేశం జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌నే న‌మ్మ‌కాన్ని ఇరు పార్టీల శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. టీడీపీవైపు నుంచి కానీ, జ‌న‌సేన‌వైపు నుంచికానీ ఇంత‌వ‌ర‌కు అధికారికంగా ఎటువంటి స్పంద‌న లేక‌పోయిన‌ప్పటికీ ద్వితీయ‌శ్రేణి నాయ‌క‌త్వంతోపాటు కార్య‌క‌ర్త‌లంతా చివ‌రి నిముషంలోనైనా పొత్తు ఖాయ‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కాన్ని వెలిబుచ్చుతున్నారు.

పొత్తులపై బహిరంగంగా మాట్లాడవద్దు..

పొత్తులపై బహిరంగంగా మాట్లాడవద్దు..

తెలుగుదేశం పార్టీలోని నేత‌ల‌కు, అధికార ప్ర‌తినిధుల‌కు పొత్తుల గురించి ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను కింగ్ మేక‌ర్‌గానైనా నిల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తున్నారు. రాష్ట్ర‌మంత‌టా పోటీచేసే బ‌దులు త‌న‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌ముందో ముందుగానే అంచ‌నావేసుకొని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి దిగాల‌ని, సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లే ల‌క్ష్యంగా చేసుకోవాలని జనసేనాని భావిస్తున్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండాల‌నే పొత్తుగా వెళ్ల‌డ‌మే స‌రైన మార్గ‌మ‌ని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వా రెండు పార్టీ ల‌మ‌ధ్య సానుకూల వాతావ‌ర‌ణం చోటుచేసుకున్న‌ప్ప‌టికీ ప్రస్తుతం ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. తెలుగుదేశం పార్టీకి 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోను ఇన్‌ఛార్జిలులేరు.

ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా అంద‌రినీ పార్టీ నియ‌మించుకుంటూ వ‌స్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్క‌డే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు కుదిరే ప‌క్షంలో ఇప్పుడు ఇన్‌చార్జిగా ఉన్న వ్య‌క్తి సీటు వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. దీనివ‌ల్ల పార్టీకి ఆ స‌మ‌యంలో న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంటుంది.

పరిస్థితులను ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధం

పరిస్థితులను ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధం


అటువంటి ప‌రిస్థితిని నిరోధించ‌డానికి అధినేత చంద్ర‌బాబు స‌మాయ‌త్త‌మ‌య్యారు. పొత్తు కుదిరే ప‌క్షంలో జ‌న‌సేకు ఏయే నియోజ‌క‌వ‌ర్గాలివ్వాల‌నుకుంటున్నామో వాటిని అలాగే వ‌దిలిపెడుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దాదాపుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీచేస్తుంద‌ని భావించ‌వ్చ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Recommended Video

సిగ్గులేకుండా అబద్ధాలా, డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం *AndhraPradesh | Telugu OneIndia
పొత్తులపై దూరదృష్టితో వ్యవహారం

పొత్తులపై దూరదృష్టితో వ్యవహారం


కృష్ణా జిల్లాలో విజయవాడ ప‌శ్చిమ‌, కైకలూరు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిల‌ను నియ‌మించ‌లేదు. అవనిగడ్డ స్థానంలో కూడా పార్టీ అధిష్టానం స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంలేదు. భీమవరం, నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పోలవరం, చింతలపూడి, కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, విశాఖలో భీమిలి, విశాఖ ఉత్తరం సీట్లు జనసేనకు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులున్న‌ప్ప‌టికీ దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రించి బాబు అభ్యర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేద‌ని భావిస్తున్నారు.

English summary
Political analysts believe that in the event of an alliance, they are leaving the constituencies they want to give to the Janasena..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X