చిరంజీవి vs బాలకృష్ణ.!. చంద్రబాబుకు కొత్త తలనొప్పి!
ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య కొంతకాలం క్రితం వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. చిరంజీవి నుంచి సినిమాల విషయంలో కొంత విరామం రావడంతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడింది. అయితే గాడ్ ఫాదర్ సినిమా నుంచి మళ్లీ ఈ ఇద్దరు అభిమానుల మధ్య రగడ ప్రారంభమైంది. మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులు చేస్తున్న కామెంట్స్ తెలుగుదేశం పార్టీ కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.

బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న మెగా అభిమానులు
గాడ్‌ఫాదర్ మూవీ తాజాగా మంచి హిట్టైంది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్, టాలీవుడ్‌లో నెంబర్ వన్ అంటూ కామెంట్స్ పెడుతూ పరోక్షంగా బాలకృష్ణకు కౌంటర్లిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు రీమేక్ సినిమాను చేసి హిట్ కొట్టడం కాదని, సొంత కథతో సొంత సినిమా చేయాలని రిప్లై ఇస్తున్నారు. పండగ సమయంలో ప్రజలు ఎక్కువగా థియేటర్లకు వస్తారని, అంతేకాకుండా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అయినా అఖండ సినిమా మొదటిరోజు కలెక్షన్లను దాటలేకపోయిందూ కౌంటర్లు ఇస్తున్నారు.

గాడ్ ఫాదర్ ను అఖండతో పోలుస్తున్న నందమూరి అభిమానులు
గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను, అఖండ సినిమా కలెక్షన్లను పోల్చిచూపుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నందమూరి అభిమానులంటే టీడీపీలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గాడ్ ఫాదర్ సినిమాపై చిరు అభిమానులు, బాలకృష్ణ అభిమానుల మధ్య జరుగుతున్న పోరులో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన అధినాయకత్వం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది.

వైసీపీని గద్దె దించడమే లక్ష్యం
పార్టీలో ఉంటూ ఇతర కథానాయకులపై కామెంట్లు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించిందని అచ్చెన్న ప్రకటించారు. ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో ఎవరూ పడొద్దని, టీడీపీ అంటే అందరిదని, అన్ని మతాలవారు, కులాలవారు, ప్రాంతాలవారు ఉంటారన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు అభిమానులుంటారని, ఒక పార్టీగా అందరూ పోరాటం చేయాల్సింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అని అచ్చెన్న అన్నారు. ప్రభుత్వం చేసే అరాచకాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలని శ్రేణులకు సూచించారు. మన లక్ష్యమంతా వైసీపీని గద్దె దించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడంపైనే ఉండాలని, ఇతర కథానాయకుల గురించి, వారి అభిమానుల గురించి వెటకారంతో, ద్వేషంతో, కసితో, వ్యంగ్యంతో.. ఇలా ఏ పోస్టులు పెట్టొద్దని కోరారు. మరి ఈ ఇద్దరు కథానాయకుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ ఆగుతుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.!












Click it and Unblock the Notifications