వరంగల్ తెలుగమ్మాయికి గూగుల్, ఎఫ్‌బీ స్కాలర్‌షిప్

చెన్నై: ఆసియా పసిఫిక్ దేశాల్లోని విద్యార్థులకు గూగుల్ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక గూగుల్ అనిత బోర్గ్ స్మారక ఉపకార వేతనంకు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న తెలుగు విద్యార్థిని బబ్బుల స్పందన రాజ్ ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది దేశాల నుండి ఇరవై ఏడు మంది విద్యార్థులను గూగుల్ సంస్థ ఎంపిక చేసింది.

అందులో ఏడుగురు విద్యార్థులు భారత దేశానికి చెందిన వారు ఉన్నారు. వారిలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన స్పందన కూడా ఎంపికయ్యారు. ఈ ఉపకారవేతనం కింద ఎంపికైన విద్యార్థులను గూగుల్ సంస్థ ఇటీవల వారం రోజుల పాటు టోక్యోలోని గూగుల్ కార్యాలయానికి తీసుకు వెళ్లి అక్కడ గూగుల్ అధికారులు, సాఫ్టువేర్ ప్రముఖులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది.

Telugu girl Spandana bags Google scholarship

దాంతో పాటు స్పందన ఫేస్‌బుక్ 2014 గ్రేస్ హాప్పర్ ఉపకార వేతనానికి కూడా ఎంపికైంది. ఈ ఉపకార వేతనం కింద వచ్చే నెల ఫినిక్స్‌లో జరిగే ఫేస్‌బుక్ సదస్సులో ఆమె పాల్గొంటారు. ఈ సదస్సుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల హాజరవుతున్నారు. అతను కూడా తెలుగువాడే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+