Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్సార్‌పై ట్రోల్స్- మౌనం వీడిన అనంత శ్రీరామ్: సైబర్ క్రైమ్‌కు కంప్లైట్ చేస్తా

అమరావతి: తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోన్నారనే కారణంతో ఆయనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. అనంత శ్రీరామ్ లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి విమర్శలకు దిగుతున్నారు.

పొలిటికల్ మిస్సైల్ అనే సోషల్ మీడియా పేజీని నిర్వహిస్తున్నారనే ఆరోపణలను వైఎస్ఆర్సీపీ అభిమానుల నుంచి ఎదుర్కొంటోన్నారు అనంత శ్రీరామ్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్.. స్టెతస్కోప్‌తో ఓ చిన్నారిని పరీక్షిస్తోన్న ఫొటోను పోస్ట్ చేశారు. వైఎస్సార్‌ను ఫేక్ డాక్టర్ అంటూ సంబోధించారు. స్కాన్ లేకుండ జస్ట్ అలా చూసి గుండెలో హోల్ ఉందని చెప్పేశాడట.. అంటూ కామెంట్స్ చేశారు.

Telugu lyricist Anantha Sriram

తెల్ల పంచె- మలినమైన మనసు మహానేత అంటూ వరుస ట్వీట్లు ఈ అకౌంట్‌లో పోస్ట్ అయ్యాయి. ఇది వైసీపీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. నిన్న, ఇవ్వాళ అనంత శ్రీరామ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. పొలిటికల్ మిస్సైల్ పేజీని ఆయనే నిర్వహిస్తోన్నారంటూ మండిపడుతున్నారు.

ఈ పేజీలో ఉన్న కంటెంట్‌కి ఆధారంగా దాన్ని ఆయనే నిర్వహిస్తోన్నారనే నిర్ధారణకు వచ్చారు. పెద్ద ఎత్తున ట్రోల్స్‌‌కు దిగారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలను సైతం వైసీపీ సోషల్ మీడియా అభిమానులు తవ్వి తీశారు. టీడీపీ సానుభూతి పరుడు కావడం, జనసేనతో అనుబంధాన్ని కలిగి ఉంటోన్నాడంటూ ఆరోపిస్తోన్నారు.

ఈ ఆరోపణలు, విమర్శలపై అనంత శ్రీరామ్ స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ సెల్ఫీ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పొలిటికల్ మిస్సైల్ అనే పేజీని నిర్వహిస్తోన్నది, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసింది తానేనంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ రాతలు, పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు అనంత శ్రీరామ్.

తాను అన్ని పార్టీలకూ పాటలు రాస్తుంటానని, అది తన వృత్తి అని అనంత శ్రీరామ్ వివరణ ఇచ్చారు. అంతే తప్ప ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం లేదని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేయాల్సి వచ్చినా.. దాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని అనంత శ్రీరామ్ చెప్పారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాకు వచ్చానని పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే తనపై పడిన వ్యతిరేక పోస్టులన్నింటిపైనా ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తాననీ అనంత శ్రీరామ్ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+