వెంటాడుతున్న భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు...వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే బాధిత ప్రాంతాల ప్రజలు కోటుకుంటున్నారు. ఇదే సమయంలో ఐఎండీ తాజా హెచ్చరిక చేసింది. రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telugu states might experience rain with thunderstorms and lightning from September 15

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా నేటితోపాటు వచ్చే మూడు రోజులు వానలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతోపాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఐఎండీ నేడు వర్ష సూచనలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+