విషాదం: కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: కెనడలోని ఫాంసన్ రివర్స్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్‌రావు,లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, రాజీవ్‌కృష్ణలు. వీరిద్దరూ విదేశాలల్లోనే ఉన్నారు.
దంపతులిద్దరూ హైదరాబాదు నగరంలోని మణికొండలో జైహింద్‌వ్యాలీలోని ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. చిన్న కొడుకు రావులపల్లి రాజీవ్‌కృష్ణ్ణ(28)గత ఆగస్టులో కెనడాలోని ఫాంసన్ రివర్స్ యూనివర్సీటీలో ఎంబీఏ చదివేందుకు వెళ్లాడు. 12వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో రాజీవ్ మరణించాడు.

మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా కెనడా పోలీసులు కుటుంబసభ్యులకు ఆదివారం రాత్రి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యులు పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ ఎంపీ జితేందర్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్‌కు సమాచారం అందించి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications