సిసిఎల్‌లో 'తెలుగు' గెలుపు: రెజినా-తాప్సీ సెల్ఫీ, ఫ్యాన్స్ హంగామా (పిక్చర్స్)
బెంగళూరు: సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌లో కేరళ స్ట్రయికర్స్ పైన తెలుగు వారియర్స్ జట్టు శనివారం నాడు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే.. అంటే 18.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
తెలుగు వారియర్స్ జట్టులో 51 పరుగులు చేసి జట్టు విజయానికి సుధీర్ బాబు కారకుడయ్యాడు. అతనిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

సిసిఎల్
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన నటి తాప్సి పన్ను. అభిమానితో ఫోటో తీసుకుంటున్న దృశ్యం.

సిసిఎల్
భారతీయ చలన చిత్రసీమ ఎనిమిది జట్లుగా తలపడే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సంగ్రామానికి శనివారం బెంగళూరులో క్లాప్ కొట్టారు.

సిసిఎల్
తొలి మ్యాచ్‌లో పంజాబ్-దే-షేర్ పై ముంబయి హీరోస్ గెలిచింది. రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ విజృంభించారు. కేరళ జట్టుపై సునాయాసంగా గెలుపొంది విజయాల ఖాతా తెరిచారు.

సిసిఎల్
తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ కేరళ స్ట్రైకర్స్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. తెలుగు వారియర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఫీల్డ్‌లో చురుగ్గా కదలడంతో ప్రత్యర్థి జట్టుకు పరుగులు సాధించడం కష్టమైంది.

సిసిఎల్
కేరళ జట్టులో ఐదుగురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. దీన్ని బట్టి తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ సత్తా అర్థం చేసుకోవచ్చు. అశ్విన్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర నందకిషోర్ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్‌కే హైలైట్.

సిసిఎల్
నిర్ణీత 20 ఓవర్లలో కేరళ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాజీవ్ పిళ్లై అత్యధికంగా 78 చేశారు. సచిన్ జోషికి రెండు వికెట్లు దక్కాయి. నందకిషోర్, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.

సిసిఎల్
149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వారియర్స్‌కి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ప్రిన్స్ డకౌట్ రూపంలో వెనుదిగిగాడు. కాగా, మ్యాచ్ సందర్భంగా చీర్ గర్ల్స్ సందడి చేశారు.

సిసిఎల్
సుధీర్ బాబు (51) చక్కటి బ్యాటింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. అర్ధ శతకం చేసిన వెంటనే వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

సిసిఎల్
అఖిల్ 18 బంతుల్లో 27తో దూకుడుగా ఆడాడు. 12వ ఓవర్లో రెండు సిక్సులు బాది ప్రేక్షకుల్లో ఉత్సాహం తీసుకొచ్చాడు. ఆ ఓవర్లో మొత్తం 20 పరుగులు పిండుకొన్నాడు. మరుసటి ఓవర్లో ఓ భారీ షాట్‌కి ప్రయత్నించి ఔటయ్యాడు.

సిసిఎల్
చివర్లో ఆశ్విన్, ఆదర్శ్ సమన్వయంతో ఆడి వారియర్స్‌ని గెలిపించారు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లతో విజయాన్ని అందుకొంది తెలుగు వారియర్స్.

సిసిఎల్
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన హీరోయిన్ తాప్సి పన్ను.

సిసిఎల్
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మ్యాచ్ సందర్భంగా తెలుగు వారియర్స్‌కు ప్రోత్సాహం..

సిసిఎల్
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మ్యాచ్ సందర్భంగా హాజరైన క్రికెటర్ శ్రీశాంత్. తెలుగు వారియర్స్ జెర్సీతో ఉన్న దృశ్యం.

సిసిఎల్
బెంగళూరులో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ప్రముఖులు. ఈ మ్యాచులో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.

సిసిఎల్
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన.. హీరోయిన్లు రెజినా, తాప్సిలు సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం.

సిసిఎల్
సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌లో కేరళ స్ట్రయికర్స్ పైన తెలుగు వారియర్స్ జట్టు శనివారం నాడు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే.. అంటే 18.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

సిసిఎల్
సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌లో శనివారం నాడు తెలుగు వారియర్స్, కేరళ స్ట్రయికర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సందర్భంగా అక్కినేని అఖిల్, కృతి సనన్ తదితరులు.

అభిమానుల హంగామా
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానుల సందడి దృశ్యం.

అభిమానుల హంగామా
బెంగళూరులో జరిగిన తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మధ్య మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న అభిమానులు.

అభిమానుల హంగామా
తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రయికర్స్ మధ్య శనివారం నాడు బెంగళూరులో సిసిఎల్ మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్‌కు మద్దతుగా అభిమానులు..
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications