బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు మహిళ గెలుపు

బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ విజయం సాధించారు.

ముంబై/చిత్తూరు: బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే.. నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డి 30ఏళ్ల క్రితం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ఆయన భార్య కండ్రిగ కృష్ణవేణిరెడ్డి ధారవి ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆమె సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో 174వ డివిజన్‌లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణవేణి విజయం సాధించారు.

telugu woman won in BMC elections 2017

గురువారం మహారాష్ట్రలో జరిగిన ముంబైతోపాటు 9కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ముంబైలో శివసేనకు 84, బీజేపీకి 82 స్థానాలు దక్కాయి. దీంతో మేజిక్ ఫిగర్ అయిన 114 స్థానాలు ఎవరికీ దక్కలేదు. ఈ క్రమంలో బీజేపీ, శివసేన మళ్లీ పొత్తుపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+