టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కూతురు కిడ్నాప్, ప్రత్యర్థులేనని

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. టిడిపి అభ్యర్థి బిల్యా నాయక్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు హైదరాబాదులోని బిఎన్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. హారిక ఎనిమిదో తరగతి చదువుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం బిల్యా నాయక్, ఆయన భార్య అనిత దేవరకొండలో ఉన్నారు.
గురువారం ఉదయం నుంచి హారిక కనిపించక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని దేవరకొండలో ఉన్న బిల్యాకు తెలిపారు. ఆయన హుటాహుటినా హైదరాబాద్ వచ్చారు. తన కుమార్తెను అపహరించారని మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్యా స్వస్థలం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రశాంతపురి తండా
సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక తన కుమార్తెను ప్రత్యర్థులే అపహరించారని బిల్యా నాయక్ ఆరోపించారు. గతంలో తన పైన రెండుసార్లు దాడులు జరిగాయన్నారు. తన కుమార్తెను వారే అపహరించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications