బాబు వెంటే బాలకృష్ణ, హరికృష్ణపై సస్పెన్స్: కేసీఆర్ వైఫల్యాలపై తీర్మానం
తిరుపతి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు.
మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి యువనేత నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. మాజీ ఎంపీ హరికృష్ణ రాకపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు వెంటే వచ్చిన బాలయ్య
చంద్రబాబు ప్రాంగణం వద్దకు చేరుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు అక్కడికి రాగానే బాలకృష్ణ కూడా ప్రత్యక్షమైపోయారు. బావ చంద్రబాబు అడుగులో అడుగేసుకుంటూ ఆయన మహానాడు ప్రాంగణంలోకి వచ్చారు.

కార్యకర్తలా లోకేష్
ఉదయం మహానాడు ప్రాంగణానికి చేరుకున్న లోకేశ్ సాధారణ కార్యకర్తలా కౌంటర్ వద్ద తన పేరు నమోదు చేసుకుని ప్రాంగణంలోకి చేరుకున్నారు. మహానాడు హాజరయ్యే వారు లోపలకు ఎలక్ట్రానికి సిస్టంను ఏర్పాటు చేశారు.
తెలంగాణ వైఫల్యాలు, కేంద్రంతో మైత్రి, జగన్ వైఫల్యంపై చర్చ
మహానాడులో ఏపీలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు, తెలంగాణలో విపక్షంలో ఉన్నందున కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలు, కేంద్రంతో మైత్రి, విపక్షాల వైఫల్యం పైన చర్చిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.












Click it and Unblock the Notifications