తెలుగు రాష్ట్రాలపై పంజా - అప్రమత్తం చేస్తోన్న అధికారులు..!!

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత క్షీణిస్తోంది. ఇంకా డిసెంబర్ రాకముందే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటికి కప్పుకొంటోన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలపై చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. సింగిల్ డిజిట్‌కు పడిపోతోంది. పగటి ఉష్ణోగ్రత కూడా అదే స్థాయిలో రికార్డవుతోంది.

ఏపీ, తెలంగాణల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతూ వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 17వ తేదీన 12.2 డిగ్రీలు, 19వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. 10.7 డిగ్రీలకు చేరింది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. క్రమంగా సంఖ్య మరింత పడిపోవచ్చని, సింగిల్ డిజిట్‌కు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. రాత్రి ఉష్ణోగ్రత 8 నుంచి 9 డిగ్రీల వరకు నమోదువుతుందని చెబుతున్నారు.

Temperatures drops in AP and Telangana, resulting in cold waves people asked to take precautions

అటు ఉత్తరాంధ్రలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలన్నీ మంచు దుప్పటిని కప్పుకొంటోన్నాయి. తూర్పు కనుమలను మంచు తెరలు అలముకున్నాయి. మరింత అందంగా కనిపిస్తోన్నాయి ఆయా ప్రాంతాలన్నీ. విశాఖపట్నం జిల్లాలో చలి అధికంగా ఉంటోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో ఉదయం 9 గంటల వరకు ఎండసోకని పరిస్థితి నెలకొంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల ప్రజలు చలిలోనే తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకుంటోన్నారు. అనంతగిరి, అరకులోయ, కొయ్యూరు, జీకే వీధి, చింతూరు, దేవీపట్నం, మారేడుమిల్లి, లంబసింగి, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, వీఆర్ పురం.. గ్రామాల్లో చలి పంజా విసురుతోంది. నవంబర్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. డిసెంబర్ నాటికి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. మున్ముందు ఉష్ణోగ్రత మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

Temperatures drops in AP and Telangana, resulting in cold waves people asked to take precautions

చలి బారిన పడకుండా ఉండాలంటూ అధికారులు సూచిస్తోన్నారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తోన్నందున.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అంటున్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోన్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలని సూచించారు. దట్టమైన పొగమంచు అలముకుంటోండటం వల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+