వర్షాలతో 10మంది మృతి: రఘువీరా, నిండుగా సాగర్

రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. రెండున్నర లక్షల హెక్టార్లలో పంట నీట మునిగిందని, మరో రెండురోజులు భారీ, అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమతంగా ఉండాలని ప్రభుత్వం తరఫున ఆదేశించినట్లు చెప్పారు.
పలు చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆరువేల అయిదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత నష్టం జరగకుండా ఉండేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
హైదరాబాదు అతలాకుతలం
భారీ వర్షాల కారణంగా హైదరాబాదు అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.












Click it and Unblock the Notifications