ఏపీలో ఒమిక్రాన్ అలజడి- ఒక్క రోజే పది కేసులు : మొత్తం 16కు చేరిన సంఖ్య - ఆంక్షల దిశగా..!!

ఏపీలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ దేవాలను ఒణికిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు దేశంలోని 23 రాష్ట్రాలకు విస్తరించింది. దేశ వ్యాప్తంగా రోజురోజుకీ కొత్తగా నమోదైన కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో ఒక్క రోజులో పది కేసులు నమోదు అయ్యాయి. వీటిని ప్రభుత్వం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు..అదే విధంగా వారి కాంటాక్టులతో వ్యాపించిన వారిగా నిర్దారించింది.

ఒకే రోజు పది కేసుల నిర్దారణ

ఒకే రోజు పది కేసుల నిర్దారణ

విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కరోనా పాజిటివ్ గా తేలితే వెంటనే జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. అక్కడి నుంచి నివేదిక వచ్చే వరకూ ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. నిర్దారణ అయిన వారికి చికిత్స అందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో ఆరుగా ఉన్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఒక్క రోజులో పది రావటంతో ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో ముగ్గురికి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. ఇదే జిల్లాలో గతంలో ఒక కేసు నమోదైంది.

విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తింపు

విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తింపు

అదే విధంగా అనంతపురం..కర్నూలు జిల్లాలకు చెందిన వారిలో ఇద్దరు చొప్పున ఒమిక్రాన్ బారిన పడినట్లుగా నిర్దారించారు. ఇక, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఒమిక్రాన్ కరోనా బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. వీరిలో అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు.. యూఏఈ నుంచి మరో ఇద్దరితో పాటుగా నైజీరియా..కువైట్..సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ముగ్గురు కాంటాక్టుల ద్వారా సోనికనట్లుగా గుర్తించారు.

ముగ్గురికి కాంటాక్టుల ద్వారా వ్యాప్తి

ముగ్గురికి కాంటాక్టుల ద్వారా వ్యాప్తి

ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసుల్లో చిత్తూరు.. తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికే కేసులను గుర్తించారు. కాగా, ఒకే రోజు పది కేసులు రావటం... కేసులం సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఆంక్షల దిశగా పునరాలోచన చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త సంవత్సరం వేడుకల పైన ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితి పైన గురువారం ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహిస్తారని..అందులో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో 16కు చేరిన ఓమిక్రాన్ కేసులు

ఏపీలో 16కు చేరిన ఓమిక్రాన్ కేసులు

కాగా, దేశ వ్యాప్తంగా 840కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరుకుంది. వేరియంట్ సోకుండా.. మాస్కుల వినియోగం.. సామాజిక దూరం పాటించటం.. అదే విధంగా వ్యాక్సినేషన్ మాత్రమే మార్గంగా ప్రభుత్వం స్ఫ్టం చేస్తోంది. అందులో భాగంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలలోకూ కేసులు పెరుగదల ఉండటంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్త చర్యలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+