వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు - వాహనాలు ధ్వసం : అదుపు తప్పిన పరిస్థితి..!!

|
Google Oneindia TeluguNews

అమలాపురంలో పరిస్థితి అదుపు తప్పింది. కోనసీమ జిల్లా పేరు మార్పుకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. వాహనాల దహనాలు..రాళ్ల వర్షం కొనసాగుతోంది. అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ ఇంటి మీదకు నిరసనకారులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. క్యాంపు కార్యాలయంలోని ఫైళ్లను తగలబెట్టారు. మంత్రి నివాసం ఆవరణలో ఉన్న వాహనాలను దగ్దం చేసారు. దీంతో..మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి బడయటకు వెళ్లిపోయారు.

ఎస్పీతో సహా పలువురు పోలీసు అధికారులు నిరసనకారుల రాళ్ల దాడిలో గాయపడ్డారు. మంత్రి ఇంటి వద్ద ఆర్టీసీ బస్సును ధ్వసం చేసారు. మూడు స్కూళ్ల బస్సులను తగలబెట్టారు. తొలుత మంత్రి ఇంటి పైన దాడి సమయంలో మంత్రి విశ్వరూప్ ఇంట్లోనే ఉన్నారు. పరిస్థితి చేయి దాటుతుందని గమనించి బయటకు వెళ్లిపోయారు. కలెక్టరేట్ కు నిరసనగా ప్రారంభమైన ఆందోళన కట్టు తప్పింది. విధ్వంసానికి కారణమైంది. అమలాపురంలో పరిస్థితితో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Tension isutation in Amalapuram,set fire to the minister Viswaroop house

అందరూ సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. అందరి అభ్యంతరాలను పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, జిల్లా అంబేద్కర్ పేరు పైన ఆందోళనలు సరి కాదని బుజ్జగిస్తున్నారు. మంత్రి ఇంటి వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే, జిల్లా పేరు మార్పులో ఆలోచన ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేసారు. అన్ని పార్టీలు కోరిన తరువాతనే జిల్లా పేరు మార్చామని చెప్పుకొచ్చారు. కొన్ని శక్తులు కొందరిని రెచ్చగొట్టారని సజ్జల ఆరోపించారు.

English summary
Situation in Amalapuram in out of control, large number of protestors set fire to the minister Viswaroop house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X