చంద్రబాబు పర్యటన రక్తసిక్తం- పుంగనూరులో రణరంగం

రాయచోటి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా.. ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం.. పుంగనూరు. వైఎస్ఆర్సీపీకి ఇది కంచుకోట. పులివెందుల తరహాలోనే చంద్రబాబుకు ఇక్కడ కూడా నిరసనల పర్వం ఎదురైంది. నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Tension prevails in Punganuru after clashes broke out between YSRCP and TDP supporters

చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలతో రెండు పార్టీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి. రాళ్లు చంద్రబాబు మీద పడకుండా రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టారు.

పరిస్థితి చేయి దాటిపోతోండటంతో పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అయినప్పటికీ- వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలను ఇక ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అకారణంగా తమ పార్టీ వారిపై దాడులు చేశారని, పోలీసులు చూస్తూ ఉన్నారంటూ ఆరోపించారు.

Tension prevails in Punganuru after clashes broke out between YSRCP and TDP supporters

ఈ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొట్టారు. పెద్దిరెడ్డిని అసభ్య పదజాలంలో చంద్రబాబు దూషించారంటూ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు రువ్వారంటూ ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెడ్డపేరు తీసుకుని రావాలని, తద్వారా ఆయనను ఓడించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు వైసీపీ నాయకులపై దాడికి దిగారంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+