మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?...చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వేపై సిట్టింగ్ ల్లో గుబులు

అమరావతి:టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన తాజా ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వే ఎపి సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సర్వేలో ఆ ఫోన్ కాల్ అందుకునేవారిలో ఎక్కువమంది తమ వ్యతిరేకులు ఉంటే పరిస్థితి ఏమిటనేదే వారి ఆందోళనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత వారం రోజులగా ఈ సర్వే జరుగుతున్న నేపథ్యంలో దీని ఫలితాలు ఎవరిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.

ఆ నంబర్ నుంచి...ఫోన్ కాల్

ఆ నంబర్ నుంచి...ఫోన్ కాల్

ఉన్నట్టుండి ఒకరి సెల్ ఫోన్ కి 83339 99999 నంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది...ఆ కాల్ అటెండ్ చేసినవాళ్లు ముందుగా ఆశ్చర్యపోతారు. ఆ తరువాత తమని ఆ వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానంగా తమ మనసులో అభిప్రాయానికి అనుగుణంగా ఆ వ్యక్తి సూచించిన నంబర్ ను నొక్కుతారు. అలా కొన్ని ప్రశ్నలకు అందుకు జవాబుల ఛాయిస్ ను పూర్తిచేయడంతో సర్వే పూర్తవుతుంది.

సిఎం స్వరమే...ఎందుకంటే?...

సిఎం స్వరమే...ఎందుకంటే?...

ఆ కాల్ చేసేది సాక్షాత్తూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ ఫోన్ కాల్ చేయడానికి కారణం...ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో భాగం. ఇది లైవ్ ఫోన్ కాకపోయినా...సిఎం చంద్రబాబు స్వరంతోనే సర్వే జరగడం వల్ల సమాధానం నిర్థిష్టంగా వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఎమ్మెల్యేల పనితీరు అంచనా వేసేందుకు చేపట్టిన ఈ ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వేకు ఆయన స్వరాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది.

ఐవీఆర్‌ఎస్‌ సర్వే...సాగుతోంది ఇలా!

ఐవీఆర్‌ఎస్‌ సర్వే...సాగుతోంది ఇలా!

ఈ ఫోన్ సర్వే ఎలా సాగుతుందంటే?..."నమస్కారం...నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను...మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి....మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?...మీరు తృప్తి చెందుతున్నారా?...సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళుతున్నారా?... మీకు అందుబాటులో ఉంటున్నారా?...అవినీతి రహిత పాలన అందిస్తున్నారా?...అంటూ పలు ప్రశ్నల అనంతరం...ఆయన ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లయితే మీ ఫోన్‌లో 1 నెంబరు నొక్కండి...అసంతృప్తిగా ఉన్నట్లయితే 2 నొక్కండి అంటూ...సూచనలతో సమాధానాలు రాబడుతూ అలా సర్వే ముగుస్తోంది.

సర్వేలపై సర్వేలు...ఇదే ఫైనలా?

సర్వేలపై సర్వేలు...ఇదే ఫైనలా?

సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంగా కొన్ని నెలల వ్యవధిలోకి వచ్చేసిన తరుణంలో అధికార పార్టీ టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ రాబట్టేందుకు సిఎం చంద్రబాబు ఈ ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వేని చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల గురించి వివిధ సంస్థలు,బృందాలు, వ్యక్తుల ద్వారా సర్వే చేయించిన సిఎం చంద్రబాబు ఫైనల్ గా ఈ ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వే జరిపిస్తున్నట్లు తెలిసింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాల ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే విషయమై ఒక నిర్థిష్ట అభిప్రాయం తీసుకోవడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారట.

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో...ఆందోళన

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో...ఆందోళన

ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఓటర్లకు ఈ ఐవీఆర్‌ఎస్‌ సర్వేకి సంబంధించి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయట. ఉదయం మొదలుకొని రాత్రి పొత్తుపోయే సమయం వరకూ ఈ కాల్స్ వస్తూనే ఉన్నాయని సమాచారం. అయితే ఇప్పుడు ఈ ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ సర్వే పైనే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందట. ఆ ఫోన్ కాల్స్ అందుకున్నవారిలో యాధృచ్చికంగా ఎక్కువమంది తమని వ్యతిరేకించేవారే అయితే తమ పరిస్థితి ఏమిటి?...అలా కొంతమందినుంచి ఫోన్ కాల్ ఫీడ్ బ్యాక్ తీసుకొని...దాని ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటే ఎలా?...అని కొందరు సిట్టింగులు ఆందోళన చెందుతుంటే...అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నావారు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకోనివారు ఈ ఐవీఆర్‌ఎస్‌ సర్వే తమ భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+