పులివెందులలో భారీగా దాడులు: టియర్ గ్యాస్ ప్రయోగం

పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి. వైసీపీ కౌన్సిలర్ల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేయడానికి టీడీపీ కార్యకర్తలు గుంపులుగా రావడం.. రెండు పార్టీల మధ్య గొడవలకు దారితీసినట్లు చెబుతున్నారు.

వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పోలీసులు గాల్లోకి సైతం కాల్పులు జరిపినట్లు స్థానికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైసీపీ నేతలకు చెందిన వాహనాలు ఈ సందర్భంగా ధ్వంసమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్‌ కేంద్రం సమీపంలో టీడీపీ శ్రేణులు వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో మోహరించి వైసీపీ అభ్యర్థులపై దాడికి యత్నించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tension was reported in Pulivendula as Police intervened using mild force and tear gas to disperse the groups

ఘటనలను చిత్రీకరిస్తోన్న మీడియా ప్రతినిధులపైనా దాడి జరిగినట్లు సమాచారం. టీడీపీ శ్రేణులను అడ్డుకోకుండా వైసీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పులివెందుల పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను కాదని పోలీసులు వైసీపీ శ్రేణులనే అడ్డుకోవడానికి ప్రయత్నాలను నిరసిస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకు అడ్డంకులు లేకుండా చూడాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వైసీపీ నేతకు చెందిన ఆస్తులకు నిప్పు పెట్టిన ఘటన కూడా పులివెందులలో కలకలం రేపింది. ఈ ఘటనను అవినాష్‌రెడ్డి ఖండించారు.

నామినేషన్ల సందర్భంగా అటు రాజంపేటలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నంది. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన తమ పార్టీ అభ్యర్థుల పత్రాలను లాక్కొని చింపివేశారని, వారిపై రాళ్లు, బీరు సీసాలు, కోడిగుడ్లతో దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. మహిళా నాయకురాళ్లను దూషించడంతో పాటు నామినేషన్లు వేస్తే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కార్యాలయంపై కూడా దాడి జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యాలయంలో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారని, ఆయన వాహనాన్ని ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారని ఆరోపించాయి. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడినట్లు వెల్లడించాయి. అయితే ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై అధికారిక నిర్ధారణ అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+