కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. అనిరుధ్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!

భారత్ లోనే కాదు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌ ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటి వరకూ రూమర్స్ గానే వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు నిజం కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం కళానిధి మారన్ దంపతులు హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 11న యూరప్‌ లోని గ్రీస్ దేశంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

అనిరుధ్ పెళ్లి వార్తల నేపథ్యంలో ఆయన సంపాదన, ఆస్తుల వివరాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. అనిరుధ్ 2012 లో 3 మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అదే సంవత్సరం ఎతిర్ నీచల్, డేవిడ్ సినిమాలకు మ్యూజిక్ కంపోజింగ్ చేశారు. ఆ తర్వాత 2013 లో వణక్కం చెన్నై, రఘువరన్ బీటెక్, కత్తి, మారి, నేనూ రౌడీనే, వేదాళం సినిమాలకు సంగీతం అందించారు. 2017 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో అజ్ఞాతవాసి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు అనిరుధ్. ఆ తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మాస్టర్, డాక్టర్, బీస్ట్, విక్రమ్, జైలర్, జవాన్, దేవర సినిమాలు అనిరుధ్ మార్క్ తో బ్లాక్ బస్టర్ విజయాలుగా మారాయి. ఇటీవల ప్యారడైజ్, జైలర్ 2 మూవీస్ కు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Anirudh to marry Kaviya Maran You ll be shocked when you find out the value of Anirudh s assets

అలాగే సుకుమార్- రామ్ చరణ్ సినిమా, లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ సినిమాలకూ అనిరుధ్ సంగీత దర్శకత్వం అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న అనిరుధ్ ఆస్తుల విలువ చూస్తే ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. సినిమాలతోపాటు మ్యూజిక్ ఆల్బమ్స్, లైవ్ షోలు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఆయన భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ ఆస్తుల విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ లెక్కలపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక కావ్య మారన్ ఆస్తుల విలువ రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+